జూన్ కి షిప్టైన ‘డబుల్ ఇస్మార్ట్’

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ టీం ‘డబుల్ ఇస్మార్ట్’ ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మార్చి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందు నిలుపుతామని ప్రకటించారు. అయితే.. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జూన్ 14న ‘డబుల్ ఇస్మార్ట్’ను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారట.

‘ఇస్మార్ట్ శంకర్’కి మించిన రీతిలో డబుల్ డోస్ ఎంటర్ టైమ్ ను పంచడమే కాదు.. ఈ సినిమాతో యాక్షన్ లోనూ హై స్టాండార్డ్ అవుట్‌ పుట్ ను అందించబోతున్నాడట పూరి జగన్నాథ్. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే దాదాపు రూ.7 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు ప్రచారం జరిగింది. 12 రోజుల పాటు చిత్రీకరించే ఆ ఎపిసోడ్ సినిమాలో ఎంతో హైలైట్ గా ఉండబోతుందట. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.

Related Posts