బాలయ్య మరో కూతురు గురించి తెలుసా..?

వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి మరో మూడు రోజుల్లో ఎఫ్3 చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఎఫ్2కి సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3పై అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆడియన్స్ లోనూ బజ్ కనిపిస్తోంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే నెక్ట్స్ మూవీ అప్డేట్స్ ని కూడా ఎఫ్3 ప్రమోషన్స్ లో రివీల్ చేశాడు. టాలీవుడ్లో వరుస హిట్స్ అందుకుంటూ పరాజయం అనేదే లేకుండా దూసుకుపోతున్న దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. తన సినిమాల్లో ఎంటర్టైన్మెంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. దీంతో ఆడియ్స్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా ఎఫ్3 ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఎఫ్3 మూవీకి ఎఫ్2కి సీక్వెల్ గా తెరకెక్కింది. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ తో పాటు సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. పాటలు, ట్రైలర్ తో మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాకి ఫుల్ గా ప్రమోషన్స్ కూడా చేసింది టీమ్. ఇదే ప్రమోషన్స్ లో అనిల్ రావిపూడి, తన తర్వాతి సినిమాకి సంబంధించిన విశేషాలను కూడా కాస్త రివీల్ చేశాడు. అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాని నందమూరి నటసింహా బాలకృష్ణతో చేయబోతున్నాడు. ఈ మూవీ తండ్రీ కూతుళ్ళ మధ్య సాగే పాయింట్ తో రాబోతుంది. బాలయ్య 45 ఏళ్ళ వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అలాగే తనకు కూతురిగా పెళ్ళిసందడి హీరోయిన్ శ్రీలీల నటించబోతుందంటున్నారు. మంచి ఎమోషన్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్తున్నారు. మొత్తంగా బాలయ్య, అనిల్ రావిపూడీ కాంబోలో సినిమా అంటే ఆడియ్స్ లోనూ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడటం ఖాయం.

Related Posts