హైదరాబాద్ లో “భీమ్లా నాయక్” భారీ కటౌట్, ఫ్యాన్స్ సందడి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ మొదలైన భీమ్లా నాయక్ ప్రతి ఇంటా సందడి చేస్తున్నాడు. సినిమాకు వస్తున్న స్పందనకు తగినట్లుగానే బాగా ప్రమోషన్ చేస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఓటీటీ. అభిమానులతో కలిసి వినూత్నంగా పబ్లిసిటీ కార్యక్రమాలు చేస్తోంది.

రీసెంట్ గా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో భారీ ఎలివేషన్ తో పవన్ కళ్యాణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ‘భీమ్లానాయక్‌’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ జీపుపై ఎలా కూర్చుంటాడో అలాగే జీపుపై కూర్చున్న పవన్‌ కటౌట్‌ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్ స్టార్ అభిమానులు పాల్గొన్నారు. సినిమా ప్రచారం కోసం ఇలా వినూత్నంగా భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ కటౌట్ చూసేందుకు అభిమానులు రోజూ నెక్లెస్‌ రోడ్‌లో సందడి చేస్తున్నారు. ఈ కటౌట్ ఎలివేషన్‌ను సందర్శిస్తున్నారు. ఓ క్రేన్‌ కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నారు.

Related Posts