‘ఈగల్‘ సోలో రిలీజ్ పై జరగనున్న చర్చ

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ఈగల్‘ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు ఉండడంతో థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమని భావించి.. ‘ఈగల్‘ చిత్రాన్ని ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు. వాయిదా వేసే సమయంలోనే తమకు సోలో రిలీజ్ కావాలని నిర్మాతలు అడగడం.. దానికి ఛాంబర్ సానుకూలంగా స్పందించడం జరిగింది.

కానీ ఇప్పుడు ‘ఈగల్‘కి సోలో రిలీజ్ దక్కేలా లేదు. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ‘యాత్ర 2, లాల్ సలామ్, ఊరు పేరు భైరవకోన‘ వంటి సినిమాలున్నాయి. అంటే.. నాలుగు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఛతుర్ముఖ పోరు నెలకొనబోతుందన్నమాట. ఈనేపథ్యంలో.. ఛాంబర్ రంగంలోకి దిగుతోంది. ఈరోజు సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ సమావేశమే.. ఫిబ్రవరి రెండో వారంలో విడుదలయ్యే సినిమాలపై చర్చించనున్నారట. సాధ్యమైనంత వరకూ ‘ఈగల్‘కి పెద్దగా కాంపిటేషన్ లేకుండా చెయ్యాలనేదే ఛాంబర్ నిర్ణయం అని తెలుస్తోంది.

Related Posts