దర్శకుల సంఘం వేడుకకు రంగం సిద్ధం

కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక.. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులంతా ఒకే వేదికపై సందడి చేసే సందర్భం రాబోతుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా.. మే 4న జరగాల్సిన డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేషన్స్ మే 19న జరగబోతున్నాయి.

హైదరాబాద్ ఎల్.బి.స్టేడియం వేదికగా గ్రాండ్ లెవెల్ లో ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తున్నారు. టాలీవుడ్ నుంచి చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి తారలు ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు. అలాగే.. అగ్ర దర్శకులు రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారు స్టేజ్ పై తమ పెర్ఫామెన్స్ లతో అలరించనున్నారట. ఇంకా.. చాలా మంది దర్శకులు ఈ ఈవెంట్ లో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచబోతున్నారు.

Related Posts