అల్లు అర్జున్ పుష్ప విషయంలో తొందరపడ్డాడా.. ?

ఐకన్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఒకప్పుడు తన తోటి హీరోలంతా వంద కోట్ల క్లబ్ గురించి మాట్లాడుతుంటే.. ఆ క్లబ్ లో చేరితో చాలు అనుకున్న వాడు కాస్తా ఇప్పుడు ఆ హీరోలు కూడా కుళ్లుకునేలా ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ను స్వయంగా తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అల వైకుంఠపురములో, పుష్ప చిత్రాల తర్వాత అతని రేంజ్ మారింది. అయితే అల్లు అర్జున్ కు మొదటి నుంచీ ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎవరైనా హీరో ఏదైనా జానర్ లో హిట్ కొడితే తనూ ఆ జానర్ లోనే వెళ్లాలనుకుంటాడు. మగధీర తర్వాత తనూ కత్తి పట్టుకోవాలని బద్రీనాథ్ చేశాడు. పోయింది. అలాంటివే మరికొన్ని సినిమాలూ ఉన్నాయి. అలా పుష్ప మొదలైనప్పుడు ఒకే సినిమాగా స్టార్ట్ అయింది. బట్.. మధ్యలో వచ్చిన కెజీఎఫ్‌ తర్వాతే రోండో భాగానికి ఆలోచన మొదలైంది. ఆలోచన ఉంటే సరిపోదు కదా..? అందుకు తగ్గ కథ కూడా కావాలి. ఈ విషయంలో వీరిది తొందరపాటు చర్య అని ఎవరికైనా అర్థం అవుతుంది.నిజానికి పుష్ప2 కథ సుకుమార్ వద్ద లేదు. ఇంకా చెబితే మొదటి పార్ట్ అయిపోతే చాలురా బాబు అని సుకుమార్ చాలాసార్లు ఫీలయ్యాడు అని అప్పట్లోనే అనేక వార్తలు వచ్చాయి.

అల్లు అర్జున్ తో వ్యవహారం కూడా చెడింది అన్నారు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు డైరెక్టర్ ప్రమేయం లేకుండా అతనే చేసుకున్నాడని టాలీవుడ్ అంతా రూమరై కూసింది అప్పట్లో. మరి ఏ మూలో నిజం లేకుండా రూమర్ రాదు కదా..? అలాంటి కాంబినేషన్ లో రెండో సినిమా అంటే చాలా పెద్ద వ్యవహారం జరగాలి. సరే జరిగింది అనుకుందాం.. అందుకే కెజీఎఫ్‌ తర్వాత వీళ్లు కూడా పుష్ప రైజ్ అని ఫస్ట్ పార్ట్ కూ రెండో భాగానికి పుష్ప ది రూల్ అని రెండో భాగానికి చిన్న పేరు వేసుకున్నారు. కానీ లీడ్ ఇచ్చినంత సులువు కాదు కథను రాసుకోవడం. అందుకే ఆ కథ కోసమే ఇప్పుడు మల్లగుల్లాలు పడుతోంది పుష్ప మూవీ టీమ్. సుకుమార్ అయితే ఇప్పటికే రెండు మూడు దేశాలు తిరిగాడు కథ కోసం. ఇంకా సెట్ కాలేదు.కథ లేకపోవడం వల్లే ఈ సినిమా ఇంత ఆలస్యం అయింది. నిజానికి మొదటే వీరికి రెండు భాగాలు చేయాలన్న ఆలోచన ఉంటే అప్పుడే అంతా సిద్ధం చేసుకుని ఉండేవారు. కానీ మధ్యలో వచ్చిన ఆలోచన కాబట్టే ఇప్పుడు ముందుకు వెళ్లడం లేదు అంటున్నారు చాలామంది. ఏదేమైనా పుష్పలాంటి విజయం వచ్చిన తర్వాత దాన్ని పక్కన బెట్టి మరో కొత్త కథకు వెళితే ఆ క్రేజ్ దీనికి తోడయ్యేది. ఇప్పుడు ఏదైనా తేడా జరిగి పుష్ప 2 పోయిందంటే మళ్లీ కథ మొదటికి వస్తుంది. అందుకే ఈ సీక్వెల్ విషయంలో వీరిది తొందరపాటు చర్యే అంటున్నారు చాలామంది. మరి వాళ్లేమంటారో..?

Related Posts