స్నేహ‌తో “పుష్ప” ప్రివ్యూ చూసిన బ‌న్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈరోజు పుష్ప చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకు మరో రెండు వారాల పాటు ఒక రోజులో అదనపు షోలు వేసుకునేందుకు అనుమతినిచ్చింది. దీంతో తెలంగాణలో పుష్ప కు తొలి వీకెండ్ అదిరిపోయే బాక్సాఫీస్ కలెక్షన్స్ దక్కనున్నాయనే అంచనాలు ఏర్ప‌డ్డాయి.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడలో విడుదల సందర్భంగా టీమ్ ప్రచారం కొనసాగిస్తోంది. అమెరికాలోనూ అత్యంత భారీగా విడుదల అయ్యింది. ప్రీమియ‌ర్ తోనే ఆఫ్ మిలియ‌న్ మార్క్ సాధించింది. బ‌న్నీ వ‌న్ మేన్ షో అంటూ అభిమానులు సంబ‌రాలు చేస్తున్నారు. రికార్డు క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేయ‌డం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. తొలి వీకెండ్ వసూళ్లకు ఏమాత్రం డోకా ఉండదని ఆన్ లైన్ బుకింగులు చెబుతున్నాయి.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. బన్నీ తన ఫ్యామిలీతో ప్రివ్యూ వీక్షించారు. అల్లు స్నేహారెడ్డి సెల్ఫీని షేర్ చేసారు. ఈ ఫోటోలో బన్నీ నేవీ బ్లూ టీషర్ట్ ధరించి రగ్గ్ డ్ లుక్ తోనే కనిపించారు. ఈ ఫోటోకు అభిమానులు అన్నా సూప‌ర్ డూప‌ర్ హాట్ అన్నా.. త‌గ్గేదేలే అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Related Posts