రికార్డులు బ్రేక్ చేసిన బింబిసార

బింబిసార విడుదలకు ముందు కళ్యాణ్‌ రామ్ కాన్ఫిడెన్స్ చూసి చాలామంది నవ్వుకున్నారు. కొందరైతే ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. కానీ కష్టపడిన వాడికి బాగా తెలుస్తుంది ఫలితం. పైగా అతని సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయింది. కళ్యాణ్‌ రామ్ ఎవరికైనా కొత్త దర్శకుడికి తన బ్యానర్ లో ఛాన్స్ ఇస్తే.. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వస్తుంది. అంతకు ముందు నేనొక్కడినే, పటాస్ తర్వాత ఇప్పుడు బింబిసారతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈ మూవీ ఓపెనింగ్ డే హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ టాక్ మాత్రమే కాదు.. కళ్యాణ్‌ రామ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనర్ గా నిలిచింది. యస్.. బింబిసార బాక్సాఫీస్ వద్దా సత్తా చాటుతున్నాడు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు థియేటర్స్ కు తండోపతండాలుగా వస్తారు అన్న కళ్యాణ్‌ రామ్ నమ్మకం నిజమైంది.బింబిసార మొదటి రోజు 6.30 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి కళ్యాణ్‌ రామ్ కెరీర్ లోనే హయ్యొస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది. ఇంతకు ముందు అతని హయ్యొస్ట్ డే ఒన్ కలెక్షన్స్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఇజం సినిమాకు. అప్పుడు మూడు కోట్లు వచ్చాయి. అంటే ఇద్దరి క్రేజ్ వల్ల అది సాధ్యమైంది. కానీ ఇప్పుడు కేవలం ఈ సినిమాకు మెయిన్ ఫేస్ కళ్యాణ్‌ రామ్ మాత్రమే. ఇది అతని విజయంగానే చూడాలి. సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా.. మొదటి టికెట్ తెగింది కళ్యాణ్‌ రామ్ కోసమే కదా..?
ఈ సినిమాకు జరిగి థియేట్రికల్ బిజినెస్ 13కోట్లు. మొదటి రోజే సగం వరకూ వచ్చేసింది. అంటే వీకెండ్ కు విజయం ఖాయమవుతుంది. ఆ తర్వాతా స్ట్రాంగ్ గా ఉంటే లాభాలు గ్యారెంటీ.
మరి ఈ సిరిమా ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ చూద్దాం..

నైజాం – 2.12 కోట్లు
సీడెడ్ – 1.25 కోట్లు
యూఏ – 57 లక్షలు
ఈస్ట్ – 43 లక్షలు
వెస్ట్ – 36 లక్షలు
కృష్ణా – 37 లక్షలు
నెల్లూర్ – 26 లక్షలు
రెస్ట్ ఆఫ్ ఇండియా,
ఓవర్శీస్ కలిపి – 2.00 కోట్లు

టోటల్ గా ఈ సినిమా షేర్ గా 6. 30కోట్లు వసూలు చేసి సత్తా చాటింది. ఏదేమైనా కళ్యాణ్‌ రామ్ నమ్మకం బలే నిజమైంది.

Related Posts