బనారస్ మూవీ రివ్యూ…

కొత్తవాళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు అయితే మ్యాజిక్ లేదంటే ట్రాజిక్ అవుతున్నాయి. అస్సలు బాలేనివి.. అరే బలే ఉంది అనేది దాటి ఫర్వాలేదు అనిపించేవి అరుదైపోయాయి. అలాంటి సినిమానే బనారస్. కన్నడ పొలిటిషియన్ కొడుకు జైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతూ ఒకేసారి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తో ఎంట్రీ ఇచ్చిన సినిమా. సోనాల్ మోంటేరో హీరోయిన్ గా నటించింది. జయతీర్థ దర్శకుడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ మూవీ రివ్యూను బ్రీఫ్ గా చూద్దాం..

కథ :-
సిద్ కాలేజ్ స్టూడెంట్. తల్లి లేకపోవడంతో గారాబంగా పెరుగుతాడు. చిన్నప్పుడే పేరెంట్స్ ను కోల్పోయిన ధని బాబాయ్, పిన్ని సహకారంతో హైదరాబాద్ లో చదువుకుంటుంది. పద్ధతైన అమ్మాయి. అలాంటి అమ్మాయిన తన ఆకతాయితనంతో అల్లరిపాలు చేస్తాడు సిద్. దీంతో తను అవమానం తట్టుకోలేక బాబాయ్ వద్దకు బనారస్ వెళ్లిపోతుంది. తప్పు తెలుసుకున్న సిద్ ఆమెకు సారీ చెప్పాలని బనారస్ వెళతాడు. కొన్ని సంఘటనల తర్వాత ధనియే సిధ్ ను ప్రేమిస్తుంది. అంతా ఓకే అనుకుంటోన్న అతను అనుకోకుండా టైమ్ లూప్ లో చిక్కుకుంటాడు. ఆ లూప్ ద్వారానే ధనితో పాటు ఆమె బాబాయ్, పిన్నిని ఎవరో దారుణంగా చంపబోతున్నారని తెలుస్తుంది. మరి టైమ్ లూప్ లో ఉన్న సిధ్ వారిని కాపాడాడా లేదా అనేది మిగతా కథ.తన వల్ల అల్లరిపాలైన అమ్మాయిని క్షమాపణ అడిగి పశ్చాత్తాపం పొందాలని ఓ యువకుడు చేసిన ప్రయాణం అతనికి ప్రేమను ఇస్తుంది. ఆ ప్రేమ వల్ల ఆమెను చావు నుంచి తప్పిస్తుంది. ఈ పాయింట్ నే టైమ్ లూప్ లో చెప్పాడు దర్శకుడు జయతీర్థ. ఈ టైమ్ లూప్ కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవడం వల్ల మరీ కనెక్టింగ్ గా అనిపించదు కానీ.. ఫస్ట్ టైమ్ చూసేవారిని బాగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. సిఫస్ట్ హాఫ్ సాగదీసినట్టుగా కనిపించినా..

సెకండ్ హాఫ్ మొత్తం మెప్పిస్తుంది. అందులోనూనిమా థియేటర్ నుంచి మొదలైన సీన్స్ నుంచి క్లైమాక్స్ వరకూ అద్భుతంగానే అనిపిస్తుంది. సింపుల్ లవ్ స్టోరీని టైమ్ లూప్ తో కనెక్ట్ చేసి ఒకేసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించాలనుకున్న వీరి ప్రయత్నం చాలా వరకూ సక్సెస్ అయినట్టే అని చెప్పాలి.ఫస్ట్ మూవీ అయినా జైద్ ఖాన్ బానే చేశాడు. హీరోయిన్ ట్రెడిషనల్ గా ఉన్నా.. ఈ పాత్రకు సూట్ కాలేదు. ఈ ఇద్దరి జంట ఏమంత గొప్పగా లేదు. హీరోయిన్ సోనాల్ ఎక్కువగా సీరియల్ నటిలా కనిపిస్తోంది. ఇతర పాత్రల్లో శంభుగా నటించిన సుజయ్ శాస్త్రి ఆకట్టుకుంటున్నాడు. అక్కడక్కడా నవ్వులు పంచాడు. ఇతర పాత్రల్లో అచ్యుత్, దేవరాజ్ సప్నా రాజ్ ఓకే అనిపించారు. అత్యంత పరిమిత పాత్రల్లో వచ్చిన ఈ మూవీలో బనారస్ మొత్తాన్ని చూపించడం విశేషం. ఓ రకంగా బనారస్ ను చూడాలనుకున్న వాళ్లు ఈ మూవీ చూసినా చాలు అనిపిస్తుంది.మ్యూజిక్ బావుంది. కొన్ని పాటల్లో తెలుగు సాహిత్యం చాలా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్. ఎడిటింగ్ పరంగా ఓ పావుగంట అయినా తగ్గించొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పిస్తాయి. దర్శకుడు జయతీర్థ రీసెంట్ గా కాంతార హీరో రిషభ్ శెట్టితో బెల్ బాటమ్ అనే సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ తీశాడు. ఆ పట్టు ఈ చిత్రంలోనూ కనిపించింది.

ఓవరాల్ గా బనారస్ టైమ్ పాస్

                    - 2.25/5



            - యశ్వంత్ బాబు

Related Posts