కొత్తవాళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఇప్పుడు అయితే మ్యాజిక్ లేదంటే ట్రాజిక్ అవుతున్నాయి. అస్సలు బాలేనివి.. అరే బలే ఉంది అనేది దాటి ఫర్వాలేదు అనిపించేవి అరుదైపోయాయి. అలాంటి సినిమానే బనారస్. కన్నడ పొలిటిషియన్

Read More

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర దర్శకుడు జయతీర్థ విలేఖరుల సమా’వేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్‌’ సినిమా ఎలా మొదలైయింది ? నా గత చిత్రం బెల్ బాటమ్ 2019 ఫిబ్రవరి లో విడుదలైయింది. మార్చ్ నెలలో ఎన్‌ కె ప్రొడక్షన్స్ హౌస్ జైద్ ఖాన్ ని లాంచ్ చేయమని నన్ను సంప్రదించింది. జైద్ ఖాన్ కు పొలిటికల్ గా ఒక స్టార్ ఇమేజ్ వుంది. జైద్ నాన్నగారు జమీర్ అహ్మద్ ప్రముఖ రాజకీయ నేత. జైద్ ని లాంచ్ చేయడం అంటే ఒక ఒత్తిడి వుంటుంది. అయితే ఒక దర్శకుడిగా నాకు పూర్తి స్వేచ్ఛ కావాలి, ఎలాంటి ఒత్తిళ్ళు వుండకూడదని వారిని కోరాను. నా కోరికని అంగీకరించారు. నాకు పూర్తి స్వేఛ్చని ఇచ్చారు. ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్ కి చాలా నచ్చింది. మూడు నెలలు స్క్రీన్ ప్లే రాశాను. నేను నాటకరంగం నుండి సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రాకముందు నటనలో శిక్షణ ఇచ్చేవాడిని. ఇది కొత్త వారితో సినిమాలు చేసినప్పుడు ఉపయోగపడింది. ఈ సినిమాలో పాత్రకి తగ్గట్టు జైద్ కి శిక్షణ ఇచ్చాను. అలాగే ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. ‘బనారస్‌’ ట్రైలర్ చూసిన తర్వాత టైం ట్రావెల్ సినిమా అనిపించింది. మరి ఇందులో ఫ్రెష్ ఎలిమెంట్ ఏమిటి ? ‘బనారస్‌’ కేవలం టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా వుంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా వుంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలు వుంటాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. జైద్ ఖాన్ లాంటి కొత్త నటుడితో సినిమా చేయడం ఎలా అనిపించింది ? బెల్ బాటమ్ చేసినపుడు రిషబ్ శెట్టి కూడా కొత్తే. రిషబ్ శెట్టి మంచి దర్శకుడు. అయితే హీరోగా అదే అతనికి తొలి సినిమా. ఆ పాత్రకి తగ్గట్టు అతన్ని మలచుకున్నా. ఇప్పటి వరకూ ఏడు సినిమాలు చేస్తే నాలుగు సినిమాల్లో కొత్తవారితోనే చేశాను. నేను యాక్టింగ్ టీచర్ కావడం వలన కొత్త వారితో చేయడం సులువు. నా పాత్రలకు తగ్గట్టు మలుచుకోగలను. ఇప్పటివరకూ నేను శిక్షణ ఇచ్చి, లాంచ్ చేసిన నటీనటులు లంతా మంచి స్థాయిలో వున్నారు. జైద్ కూడా తప్పకుండా గొప్ప స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను. ‘బనారస్‌’ షూటింగ్ ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ? 90 శాతం షూటింగ్ బనారస్‌ లోనే చేశాం. 2019 సెప్టెంబర్ లో షూటింగ్ వెళ్లినపుడు వరదలు వచ్చాయి. తర్వాత అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరిలో షూటింగ్ చేశాం. అయితే 2,3 డిగ్రీల ఉష్ట్నోగత వద్ద షూట్ చేయడం ఒక సవాల్. అయితే స్థానికులు చాలా సహకరించారు. లాక్ డౌన్ కి ముందే రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. లాక్ డౌన్ ఎత్తిన తర్వాత పాటలు షూట్ చేశాం. సెన్సార్ పూర్తయిన తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిజానికి బనారస్ యూనివర్సల్ అప్పీల్ వున్న కంటెంట్. భారీ నిర్మాణ , సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేయడంతో మరికొన్ని మార్పులు చేశాం. ఫైనల్ ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చింది. ట్రైలర్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. వైజాగ్, హైదరాబాద్ వెళ్ళినపుడు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కదా ? అవును.. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఇది. కంటెంట్ నచ్చితే భాషలకు అతీతంగా ఆదరిస్తారు. బనారస్ ట్రైలర్ పాటలు వారికి నచ్చాయి. నా బెల్ బాటమ్ సినిమాని కూడా ఓటీటీలో పెద్ద హిట్ చేశారు. ఇప్పుడు జైద్ లాంచింగ్ కిముందే గొప్ప ప్రేమని పంచారు. సినిమా చూసిన తర్వాత మరింతగా ప్రేమిస్తారు. సినిమాని చూసిన తర్వాత మంచి పాజిటివ్ కంటెంట్ ని చుశామనే ఆనందం ప్రేక్షకుల్లో కలుగుతుందనే నమ్మకం వుంది. కెజియఫ్, కాంతార.. చిత్రాలతో కన్నడ పరిశ్రమ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది ? చాలా ఆనందంగా వుంది. కెజియఫ్, కాంతార,777 చార్లీ, విక్రాంత్ రోణ చిత్రాలు దేశవ్యాప్తంగా మంచి పేరుతెచ్చుకున్నాయి. కన్నడ నుండి వచ్చే సినిమాలని ప్రేక్షకులు ఇప్పుడు నోటీస్ చేస్తున్నారు. ‘బనారస్’ కూడా మంచి కంటెంట్ వున్న చిత్రం. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అనే ఎక్సయిమెంట్ వుంది. అజినీష్ లోక్ నాథ్ మ్యూజిక్ గురించి ? మేమిద్దరం కలసి బెల్ బాటమ్ చేశాం. బనారస్ లో కూడా సంగీతానికి చాలా ప్రాధాన్యత వుంది. ఇందులో హీరోయిన్ సింగర్. వెస్ట్రన్, క్లాసిక్, ఫ్లోక్, డివైన్ ఇలా అన్నీ కోణాలు వున్న సంగీతం ఇందులో వుంది. మరో విశేషం ఏమిటంటే.. బెల్ బాటమ్ కి పని చేసిన టెక్నికల్ టీం కాంతారకి పని చేసింది. కాంతార టీం బనారస్ కి పని చేసింది. క్యాలిటీ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. కొత్తగా చేయబోతున్న సినిమాలు ? బనారస్ తర్వాత ‘కైవ’అనే సినిమా చేస్తున్నాను. ఇప్పటికే షూటింగ్ మొదలైయింది. జనవరిలో బెల్ బాటమ్ 2 వుంటుంది. ఆల్ ది బెస్ట్

Read More

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘బనారస్’ విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ? ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది. పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ? కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది. ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ? టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ? జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది. కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ? కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది. మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ? నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది. తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ? తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం. జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు. కొత్తగా చేయబోతున్నా సినిమాలు ? మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.

Read More

కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘బనారస్‌’ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్

Read More