అఖండ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

అఖండ రికార్డుల మోత కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా ఆరంభం నుంచి భారీ అంచనాలతోనే మొదలైంది. వాటిని అందుకోవడంలో ఈ టీమ్ ఏ మాత్రం తగ్గలేదు. బోయపాటి డైరెక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అఖండ టైటిల్ కు తగ్గట్టుగానే అఖండ విజయం అందుకుంది. ఈ విజయం పరిశ్రమను సైతం ఆశ్చర్యపరిచిందంటే అతిశయోక్తి కాదు. బాలయ్య నట విశ్వరూపం చూపించడం.. దానికి తమన్ నేపథ్య సంగీతం ఓ రేంజ్ లో సెట్ అవడం, బోయపాటి తనదైన శైలిలో చూపించిన టేకింగ్, ఊరమాస్ ఫైట్స్ అన్నీ కలిసి అఖండను అద్భుత విజయంగా మలిచాయి.
ఇక చాలామంది ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో ఈ కాలంలో కూడా ఈ మూవీ 103 కేంద్రాల్లో యాభై రోజులు ఆడింది. అంతేనా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 50 రోజు కూడా అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఏకైన చిత్రంగానూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ఈ శుక్రవారం నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలో ఓటిటిలోనూ ఓ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు బాలయ్య.
ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లో 24 గంటల్లోనే అత్యధిక మంది చూసిన చిత్రంగా అఖండ కొత్త రికార్డ్ సాధించాడు. యస్.. ఇంతకు ముందు కూడా ఈ రికార్డ్ చాలా సినిమాలకు వచ్చింది. బట్ చాలా తక్కువ టైమ్ లోనే రికార్డ్ మాయమైంది. బట్..ఓ మాస్ హీరోకు.. అది కూడా బాలయ్య లాంటి వెటరన్ స్టార్ మూవీకి ఈ స్థాయిలో వ్యూవర్షిప్ రావడం అనూహ్యమే. అందుకే ఈ రికార్డ్ ఎంత త్వరగా కనుమరుగైనా.. బాలయ్యకు, అతని అభిమానులకు సంబంధించి ఓ రేర్ రికార్డ్ గానే మిగిలిపోతుంది.

Related Posts