‘గుంటూరు కారం’ నుంచి ఎమోషనల్ సాంగ్

‘గుంటూరు కారం’ నుంచి ఇప్పటికే రిలీజైన పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘దమ్ మసాలా, కుర్చీ మడతపెట్టి’ గీతాలు మాస్ ను ఓ రేంజులో ఊపేస్తుంటే.. ‘ఓ మై బేబీ’ సాంగ్ రొమాంటిక్ గా ఆకట్టుకుంది. అయితే.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘మావా ఎంతైనా ఫర్లేదు బిల్లు..’ అంటూ సాగే ఎమోషనల్ సాంగ్ రిలీజయ్యింది. ‘మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు’ అంటూ హీరో మహేష్ తన మనసులోని బాధను వెల్లిబుచ్చుకునే గీతంగా ఈ పాటను తీర్చిదిద్దాడు త్రివిక్రమ్. తమన్ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి రచన చేసిన ఈ గీతాన్ని రామాచారి కోమండూరి, శ్రీకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటలో మహేష్ తో పాటు మీనాక్షి చౌదరి కూడా సందడి చేసింది.

Related Posts