భారీ పాన్ ఇండియా మూవీలో అక్కినేని అఖిల్?

సరైన విజయాలైతే దక్కలేదు కానీ.. అక్కినేని అఖిల్ టాలెంట్ ను తక్కువ చేయడానికి ఏమీ లేదు. ఈతరం హీరోలకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ పుష్కలంగా ఉన్న నటుడు అఖిల్. సినిమా సినిమాకీ తన మేకోవర్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నా.. కథల ఎంపికలో మాత్రం తడబడుతూనే ఉన్నాడు. ఫలితంగా సరైన హిట్ పడటం లేదు. ఇక.. ‘ఏజెంట్‘ తర్వాత అఖిల్ ఏ సినిమా చేయబోతున్నాడు? ఎవరితో వర్క్ చేస్తాడు? అనే దానిపై లేటెస్ట్ గా ఓ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

అఖిల్ అప్ కమింగ్ మూవీని భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడనే ప్రచారం ఉంది. ‘కె.జి.యఫ్, సలార్‘ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ నిర్మిస్తుందట. అలాగే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యు.వి. క్రియేషన్స్ సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యులుగా ఉండబోతున్నారట. అందుకే.. ఆమధ్య జరిగిన ‘సలార్‘ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ సందడి చేశాడని ఫిల్మ్ నగర్ టాక్. మొత్తంమీద.. త్వరలోనే అఖిల్ అప్ కమింగ్ మూవీపై క్రేజీ అప్డేట్ రాబోతుందట.

Related Posts