తెలుగులోనూ రాబోతున్న ‘బడే మియా ఛోటే మియా’

బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలయికలో మల్టీస్టారర్ గా రూపొందుతోన్న చిత్రం ‘బడే మియా ఛోటే మియా’. ‘ఏక్ థా టైగ‌ర్, సుల్తాన్‘ సినిమాల ఫేమ్ అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. మానుషి చిల్లార్, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తుండగా.. మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ‘బడే మియా ఛోటే మియా’ తెలుగు టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

‘ప్రళయం రాబోతోంది… ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిషత్తు కాలాలను మార్చివేస్తుంది… ఆ మహా ప్రళయం మంచి చెడులు మధ్య సంఘర్షణలను శాస్వతంగా నిర్ములిస్తుంది”… అంటూ సాగే డైలాగ్స్ తో మొదలైన టీజర్ ఆద్యంతం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. వాసు భగ్నాని, పూజా ఎంటర్ టైన్ మెంట్స్, ఆలీ అబ్బాస్ జాఫర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈద్ కానుకగా ఏప్రిల్ లో విడుదలకాబోతుంది.

Related Posts