‘ఈగల్‘ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్

నటీనటులు: రవితేజ, అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు
సినిమాటోగ్రఫి: కార్తీక్ ఘట్టమనేని, కరమ్ చావ్లా, కమిల్ ప్లోకి
సంగీతం: దేవ్ జాంద్
నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్
దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని
విడుదల తేదీ: 09-02-2024

ఈమధ్య కాలంలో ఎక్కువ కాలం ప్రచారంలో ఉన్న చిత్రం ‘ఈగల్‘. అసలు సంక్రాంతి బరిలోనే రావాల్సిన రవితేజ నటించిన ఈ సినిమా రేపు (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో ‘ఈగల్‘పై అంచనాలు భారీగానే పెరిగాయి. ముఖ్యంగా.. ఈ మూవీలో రవితేజ మేకోవర్ కొత్తగా కనిపిస్తుంది. పొడవాటి జుట్టు, గడ్డంతో మాస్ మహారాజ కనువిందు చేయబోతున్నాడు. మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి చేయబోతున్న ‘ఈగల్‘ సినిమాకి.. ఓవర్సీస్ నుంచి రివ్యూస్ వస్తున్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘ఈగల్‘ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ కి ఇది దర్శకుడిగా రెండో సినిమా. 2015లోనే నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య‘ అనే చిత్రం చేశాడు. సినిమాటోగ్రాఫర్ గా తన విజువల్స్ తో ఎలా మ్యాజిక్ చేస్తాడో.. డైరెక్టర్ గానూ కార్తీక్ తన విజన్ తో ఆడియన్స్ ను ఆశ్చర్యపరుస్తుంటాడు.

‘ఈగల్‘ మూవీ టైటిల్ దగ్గరనుంచీ.. టీజర్, సాంగ్స్, ట్రైలర్.. అన్నీ ఓ సరికొత్త ఫీల్ ను కలిగించాయి. ముఖ్యంగా.. ‘విధ్వంశం నేను.. విధ్వంశాన్ని ఆపే వినాశనం నేను’ అంటూ రవితేజను సరికొత్తగా చూపించడమే కాదు.. మాస్ మహారాజకి ఈ మూవీతో మంచి హిట్ ఇవ్వబోతున్నాడనే సూచనలు అందించాడు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమాలో రైతు సమస్యలకు రివేంజ్ డ్రామాను జోడించి ఈగ‌ల్ మూవీని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అద్భుతంగా తెరకెక్కించాడనే రివ్యూస్ వస్తున్నాయి.

హీరో రవితేజా కూడా సినిమా విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్ చూసి ‘ఐయామ్ సూప‌ర్ సాటిస్పైడ్‘ అంటూ తన రివ్యూ చెప్పేశాడు. లేటెస్ట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే 40 నిమిషాల ఎపిసోడ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుందన్నారు. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ అలాంటి క్లైమాక్స్ చూడకపోయి ఉండొచ్చన్నారు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ‘ఈగల్‘ని చూస్తోన్న వారి నుంచి కూడా ఈ మూవీ క్లైమాక్స్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

స్నైప‌ర్ క్యారెక్టర్ లో ర‌వితేజ యాక్టింగ్‌, యాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. గ‌త సినిమాల‌కు మించి ‘ఈగ‌ల్‌‘లో ర‌వితేజ మ‌రింత‌ ఎన‌ర్జిటిక్‌ గా కనిపించాడని.. మాస్ మ‌హారాజా ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఓ విజువ‌ల్ ట్రీట్‌ అందించడం ఖాయమనే రివ్యూస్ వస్తున్నాయి.

మొత్తంమీద.. మంచి సందేశంతో పాటు మాస్‌, యాక్షన్ అంశాల‌ను జోడించి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ‘ఈగ‌ల్‌‘తో మంచి మూవీని అందించాడన్నదే అన్ని రివ్యూల సారాంశం. చూడాలి మరి.. రేపు తెలుగు రాష్ట్రాల్లో ‘ఈగల్‘కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.

Related Posts