‘దేవర’ మ్యూజిక్ కి అదిరిపోయే డీల్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ ‘దేవర’. ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించబోతున్న చిత్రాలలో ఇదొకటి. రెండు భాగాలుగా రెడీ అవుతోన్న ‘దేవర’ ఫస్ట్ పార్ట్ ను ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

అసలు ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ చిత్రానికే అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాల్సి ఉంది. అనివార్య కారణాలతో అప్పుడు ఈ కాంబో సెట్ అవ్వలేదు. ఇప్పుడు ‘దేవర’తో ఈ క్రేజీ కాంబోకి శ్రీకారం జరిగింది. ఎన్టీఆర్ ఎనర్జీకి.. అనిరుధ్ మాస్ బీట్స్ తోడవ్వడంతో ‘దేవర’ మ్యూజిక్ కి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్ లో తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’తోనూ.. అనిరుధ్ ‘జవాన్’తోనూ సెన్సేషన్ సృష్టించారు. ఇంత క్రేజున్న కాంబినేషన్ కాబట్టే ‘దేవర’ మ్యూజిక్ ను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుందట పాపులర్ మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్. అందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే.. ఈ డీల్ ఎన్ని కోట్లకు జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక.. జనవరి 8న రాబోతున్న ‘దేవర’ గ్లింప్స్ కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related Posts