అజయ్ దేవగణ్ మూవీ ఓపెనింగ్ కి వెళ్లిన రవితేజ.. అసలు కారణం అదే?

లాంగ్ గ్యాప్ తర్వాత మాస్ మహారాజ రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఇటీవలే ఈ సినిమా ముహూర్తాన్ని జరుపుకోవడంతో పాటు సెట్స్ పైకి కూడా వెళ్లింది. ఈ సినిమా బాలీవుడ్ లో హిట్టైన అజయ్ దేవగణ్ ‘రైడ్’ చిత్రానికి రీమేక్ గా రూపొందుతోంది. ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైడ్ కి వెళ్లడమే ఈ మూవీ స్టోరీ. ఇండియన్ హిస్టరీలోనే దాదాపు మూడు రోజుల పాటు జరిగిన లాంగెస్ట్ రైడ్ ఇది. 1980లలో జరిగిన ఆ వాస్తవ సంఘటల ఆధారంగానే 2018లో అజయ్ దేవగణ్‌ ‘రైడ్’ మూవీ వచ్చింది.

తెలుగులో ‘రైడ్’ రీమేక్ గా ‘మిస్టర్ బచ్చన్’ తెరకెక్కుతుంటే.. ఇప్పుడు బాలీవుడ్ లో ‘రైడ్’కి కొనసాగింపుగా ‘రైడ్ 2’ చేస్తున్నాడు అజయ్ దేవగణ్. ఈ మూవీ ఓపెనింగ్ కి ‘మిస్టర్ బచ్చన్’ టీమ్ హాజరయ్యింది. ఓ చార్టెట్ ఫ్లైట్ లో హీరో రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ లతో పాటు.. నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ‘రైడ్ 2’ ఓపెనింగ్ కి వెళుతున్న పిక్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Related Posts