ఒకే టైటిల్ కోసం ఇద్దరు హీరోల గొడ‌వ‌

ఫిలింఛాంబర్లో సినిమాల టైటిల్స్ కి సంబంధించి ఏదొక పంచాయితీ జ‌రుగుతూనే ఉంటుంది. ఈ టైటిల్స్ పంచాయితీ నాటి నుంచి నేటి వ‌ర‌కు జ‌రుగుతూనే ఉంది. అయితే.. ఈమ‌ధ్య కాలంలో ఈ టైటిల్స్ పంచాయితీ కాస్త ఎక్కువ అయ్యాయ‌ని చెప్ప‌చ్చు. క‌త్తి, ఖ‌లేజా, పులి, గ్యాంగ్ లీడ‌ర్… ఇలా టైటిల్స్ కోసం ఛాంబ‌ర్ కి ఎక్క‌డం… పంచాయితీలు జ‌ర‌గ‌డం కామ‌న్. అయితే… కొన్నిటికి సయోధ్య కుదిరితే చాలా వాటికి కుదరని సందర్భాలున్నాయి. అగ్రహీరోలు కోరితే ఇతరులు టైటిళ్లను త్యాగం చేసిన సందర్భాలున్నాయి.

అస‌లు విష‌యానికి వ‌స్తే… ఇప్పుడు ఇద్దరు యంగ్ హీరోల పంచాయితీ ఫిలింఛాంబర్ కి చేరుకుంది. ఆ ఇద్ద‌రు యంగ్ హీరోలు ఎవ‌రంటే.. రామ్ పోతినేని, హవీష్. వీరిద్ద‌రి మధ్య టైటిల్ వార్ జ‌రుగుతుంది. అయితే… తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో పరిష్కారం వెతుకుతోంది. వారియర్ అనే టైటిల్ కోసం ఈ పోరు కొనసాగుతోంది. హవీష్ కోసం వారియర్ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు నిర్మాత దాసరి కిరణ్. కానీ ఇంతలోనే రామ్, లింగుసామి సినిమా కోసం ది వారియర్ టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేశామని చెబుతున్నారు. వీరిద్దరూ వారియర్ అనే టైటిల్ ను లాక్ చేయడంతో పాటు తమ సినిమాలకు ఆ టైటిల్ క‌రెక్ట్ అని ఇద్దరూ భావించడంతో ఈ గొడవ మొదలైంది.

హ‌వీష్ బాక్సింగ్ నేప‌ధ్యంలో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. విదేశాల్లో ఎక్కువ షూటింగ్ ప్లాన్ చేశారు. ఈ మూవీ కోసం ఈ టైటిల్ రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. మా క‌థ‌కు క‌రెక్ట్ టైటిల్ ఇది. అందుచేత త‌గ్గేదేలే అంటున్నారు. రామ్ ఆల్రెడీ వారియ‌ర్ టైటిల్ తో పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వీళ్లు కూడా త‌గ్గేదేలే అంటున్నారు. దీంతో ఛాంబ‌ర్ కి ఈ గొడవ పెద్ద‌త‌ల‌నొప్పిలా మారింది. మ‌రి… చివ‌రికి వారియ‌ర్ టైటిల్ ను ఎవ‌రు ద‌క్కించుకుంటారో చూడాలి.

Related Posts