చైత‌న్య‌, స‌మంత విడాకుల పై స్పందించిన నాగార్జున‌

నాగ‌చైత‌న్య‌, స‌మంత‌… విడిపోయి మూడు నెల‌లు అయినా ఇంకా వాళ్ల గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. వాళ్లిద్ద‌రూ విడిపోవ‌డానికి కార‌ణాలు ఇవే అంటూ నెట్టింట్లో తెగ వార్త‌లు పుట్టుకొస్తున్నాయి. స‌మంత బోల్డ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డం నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌ల‌కు ఏమాత్రం ఇష్టంలేద‌ని… అలాగే అక్కినేని కుటుంబం ఆమెకు కొన్ని ష‌ర‌తులు పెట్టింద‌ని… దీని వ‌ల‌న నాగ‌చైత‌న్య‌తో స‌మంత‌కు గొడ‌వ‌లు జ‌రిగాయ‌ని.. ఇలా ఎన్నో వార్త‌లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి.

అయితే… ప్ర‌స్తుతం బంగార్రాజు స‌క్స‌స్ ను ఎంజాయ్ చేస్తున్న నాగార్జున‌… నాగ‌చైత‌న్య‌, స‌మంత విడాకుల గురించి తాజాగా ఓ ఇంగ్లీషు ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో స్పందించారు. ఇంత‌కీ నాగార్జున ఏమ‌న్నారంటే… ప్ర‌జెంట్ చెత్త వార్త‌లను కొంత మంది కావాల‌నే సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛాన‌ల్స్ లో ఇలాంటి వార్త‌ల‌కు కొద‌వేలేదు. నాపై ఎలాంటి వార్త‌లు రాసినా నేను ప‌ట్టించుకోను. కాక‌పోతే నా కుటుంబం గురించి నెగిటివ్ వార్త‌లు రాయ‌డం న‌న్ను ఎంత‌గానో బాధించింది అన్నారు. నాగ‌చైత‌న్య కూడా స్పందిస్తూ… తాను ఏమాత్రం ప‌ట్టించుకోను అన్నారు.

Related Posts