వై.ఆర్.ఎఫ్ స్పై యూనివర్శ్ ఫిల్మ్ ఫెస్టివల్

మార్వెల్, డి.సి. సినిమాటిక్ యూనివర్శ్ తరహాలోనే ఇండియాలో బాగా పాపులరైన సినిమాటిక్ యూనివర్శ్ ‘వై.ఆర్.ఎఫ్ స్పై యూనివర్శ్. బాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించే స్పై మూవీస్ కి సెపరేట్ క్రేజుంది. ఈ యూనివర్శ్ లో ఇప్పటికే వచ్చిన ‘ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, వార్, పఠాన్’ సినిమాలకు కొనసాగింపుగా రాబోతుంది ‘టైగర్ 3’.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దివాళి స్పెషల్ గా నవంబర్ 12న రిలీజ్ అవుతోంది. అయితే.. ఈ సినిమా రిలీజ్ కు ముందు ‘వై.ఆర్.ఎఫ్ స్పై యూనివర్శ్ లో వచ్చిన గత చిత్రాలన్నింటినీ ప్రదర్శించడానికి పి.వి.ఆర్.ఐనాక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది యశ్ రాజ్ ఫిల్మ్స్. నవంబర్ 3 నుంచి 5 వరకూ ఇండియాలోని ప్రైమ్ లొకేషన్స్ లో ఈ సినిమాలను ప్రదర్శించబోతున్నారు. ‘టైగర్ 3’ చూసే ముందు ఈ యూనివర్శ్ లోని చిత్రాలన్నింటినీ చూడడానికి యశ్ రాజ్ ఫిల్మ్స్ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఫెస్టివల్ ఇది. మరోవైపు ఇదే స్పై యూనివర్శ్ లో ‘టైగర్ 3’ తర్వాత రాబోతుంది ‘వార్ 2’. ఈ క్రేజీ మల్టీస్టారర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు.

Related Posts