పూజా కొత్త ప్రాజెక్ట్స్ పై క్లారిటీ లేదు

షార్ట్ పీరియడ్ లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది పూజా హెగ్డే. అయితే.. అంతే త్వరగా అవకాశాలు కోల్పోయింది. అసలు మహేష్ బాబు ‘గుంటూరు కారం’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలలో పూజా హీరోయిన్ గా నటించాల్సి ఉంది. ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ లో పాల్గొంది కూడా. ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఒకవిధంగా ‘ఆచార్య, ఎఫ్ 3’ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించలేదు పూజ. ఆ తర్వాత ఒకటి, రెండు హిందీ సినిమాలు చేసినా అవేమీ వర్కవుట్ అవ్వలేదు. హిందీలో అయితే షాహిద్ కపూర్ తో ఒక సినిమా ఉంది కానీ.. తెలుగులో పూజా కొత్త ప్రాజెక్ట్స్ పై ఎలాంటి క్లారిటీ లేదు.

అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీలో పూజా హెగ్డే నటించబోతుందనే ప్రచారం జరిగింది. అయితే.. ఇంకా బన్నీ-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లేదెప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే.. ‘టిల్లు క్యూబ్’లో సిద్ధు జొన్నలగడ్డ కి జోడీగా పూజా నటించబోతుందని.. నాగచైతన్య తో కార్తీక్ దండు తెరకెక్కించే మూవీలోనూ పూజా హీరోయిన్ గా చేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. కానీ.. వీటిలో ఏ ఒక్క సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు.

Related Posts