మూడు నెలల గ్యాప్‌లోనే ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్’

సౌతిండియాస్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకడు. 30 ఏళ్ల తన కెరీర్ స్పాన్ లో శంకర్ విడుదల చేసిన చిత్రాల సంఖ్య అక్షరాల 13. అంటే.. రెండేళ్లకు, రెండున్నరేళ్లకు ఒక సినిమా చొప్పున విడుదల చేశాడు. అయితే.. ఈ ఏడాది కేవలం మూడు నెలల్లోనే శంకర్ నుంచి రెండు చిత్రాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

గతంలో ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే వాడు శంకర్. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ మొదలైంది. కొన్ని అనివార్య కారణాలతో ‘ఇండియన్ 2’ ఆగిపోవడంతో.. మధ్యలో రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ని షురూ చేశాడు శంకర్.

ఇంచుమించు రెండు సినిమాలు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకోబోతుంది. ‘ఇండియన్ 2’ని జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకున్నారు. కానీ.. జూన్ లోనే కమల్ నటిస్తున్న మరో చిత్రం ‘కల్కి’ ఉండడంతో.. జూలై 18న ‘ఇండియన్ 2’ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని అక్టోబర్ లేదా నవంబర్ లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలా.. మూడు నెలల గ్యాప్ లోనే శంకర్ నుంచి రెండు మెగా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయన్నమాట.

Related Posts