వస్తున్న టెంపో ఏంటీ చేస్తున్న స్టెప్పులేంటీ.. బ్రో ట్రైలర్

పవన్ కళ్యాణ్, సాయితేజ్ కలిసి నటించిన బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది.సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసుకున్న బ్రో ట్రైలర్ ” భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషులందరూ వాడి వారసులు. ఎవడి తలమీద వాడే పెట్టుకుంటాడు. ఇంకెవ్వడికీ ఛాన్స్ ఇవ్వడు..” అంటూ పవన్ కళ్యాణ్ వాయిస్ తో స్టార్ట్ అయింది.

ఆ తర్వాత ఎంటర్ అయిన సాయితేజ్ ప్రతిదానికి టైమ్ లేదు టైమ్ లేదు అంటూ హడావిడీగా వెళుతుంటాడు. ఆ క్రమంలో అతనికి మరో మనిషి పరిచయం అవుతాడు. మరి నువ్వెవరు అని అడిగితే.. ‘నీ దగ్గర ఎప్పుడూ లేదు లేదు అని తిరుగుతావే.. అదే నేను. టైమ్.. అంటాడు పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి ట్రైలర్ అంతా ఎమోషనల్ గా మారుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ సాయితో అంటాడు.. “కంగ్రాట్స్ బ్రో.. అందరూ టైమ్ లో ముందుకెళుతుంటారు. నువ్వొక్కడివే టైమ్ లో వెనక్కి వెళుతున్నావ్.. ” అంటాడు. అప్పుడు సాయి.. ” చచ్చి బతికిపోయానన్నమాట. అనవసరంగా బతికి చచ్చాను.. “అంటాడు. అంటే అప్పటికే సాయితేజ్ పాత్ర చనిపోతుంది.ఓ ప్రమాదంలో అతను మరణిస్తాడు. కానీ అతన్ని బ్రతికిస్తాడు దేవుడుగా ఉన్న పవన్. అంటే అప్పటి వరకూ తను ఏం కోల్పోయాడు అనేది చెప్పడానికి మరికొన్ని సీన్స్ రివర్స్ లో కనిపిస్తాయి. అదే అందుకే సాయి బతికి చచ్చాను అనుకుంటాడు. ట్రైలర్ చివర్ లో వచ్చిన రెండు డైలాగ్స్ బలే ఉన్నాయి..

వస్తున్న టెంపో ఏంటీ.. నువ్వు చేస్తున్న స్టెప్పలేంటీ అంటూ మ్యూజిక్ బీట్స్ చెబుతుంటాడు పవన్. దీంతో పాటు జల్సాలోని పాటకు పవన్ తన స్టెప్ ను రిపీట్ చేసిన సీన్ కూడా ఉంది. అలాగే చివర్లో ఇప్పటి వరకూ లిప్ స్టిక్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు బ్రో అంటే.. అందుకే చంపేశా అంటాడు పవన్.
మొత్తంగా సముద్రఖని మనిషి జీవితంలో ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు అని ఈ ఇద్దరు స్టార్స్ తో కలిసి చెప్పాలనుకుంంటున్నాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఒక మనిషికి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికే అవకాశం ఇస్తే.. అతను తన జీవితాన్ని ఎంత వేస్ట్ చేసుకున్నాడు అనేది తెలియజెప్పే ప్రయత్నంలా ఉంది. .


ట్రైలర్ లో చాలా ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి వంటి పాత్రలున్నాయి. అన్నిటీకి ఓ ప్రాధాన్యత ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సో.. ఈ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ రైడ్ థియేటర్స్ లో ఎలా ఉంటుందో చూడాలి.

Related Posts