రసవత్తరంగా మారుతోన్న సంక్రాంతి

రాబోయే సంక్రాంతి సీజన్ రసవత్తరంగా మారుతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అరడజను సినిమాలు సంక్రాంతి బరిలో పోటీకి సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి కి ఇంకా రెండున్నర నెలల సమయం ఉంది. అయినా.. ఇప్పట్నుంచే పోటీ సినిమాలన్నీ ప్రచారంలో స్పీడు పెంచుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ పోటీ నుంచి తగ్గేదే లే అంటూ హింట్స్ ఇస్తున్నాయి.

సంక్రాంతి బరిలో ఉన్న ‘గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్’ చిత్రాలు ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాయి. వీటిలో ‘గుంటూరు కారం, హనుమాన్’ సినిమాలు జనవరి 12న వస్తుంటే.. ‘సైంధవ్, ఈగల్’ జనవరి 13న రాబోతున్నాయి. లేటెస్ట్ గా జనవరి 13న రాబోతున్నట్టు రవితేజ ‘ఈగల్’ టీమ్ అనౌన్స్ చేసింది. ఇంకా.. సంక్రాంతికి రానున్న ‘నా సామి రంగా, ఫ్యామిలీ స్టార్’ విడుదల తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది.

సంక్రాంతి అనగానే మూడు, నాలుగు చిత్రాలకు మంచి స్కోప్ ఉంటుంది. ఆ సినిమాలకు తగ్గట్టు థియేటర్లు కూడా సర్దుబాటు చేయొచ్చు. కానీ.. ఒకేసారి అరడజను సినిమాలంటే థియేటర్ల సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరి.. సంక్రాంతి దగ్గర పడే కొద్దీ వీటిలో ఎన్ని సినిమాలు విడుదలవుతాయో? ఎన్ని వాయిదా పడతాయో? చూడాలి.

Related Posts