తెలుగులో మూడు నాలుగు సినిమాలు హిట్ కాగానే ఆయా హీరోయిన్ల నెక్ట్స్ స్టెప్ అండ్ డ్రీమ్ బాలీవుడ్. పైగా ఇప్పుడు ప్యాన్ ఇండియన్ ట్రెండ్ కూడా నడుస్తోంది కాబట్టి.. అక్కడా వెలిగిపోవాలి. ఇదే ఇప్పుడు కాస్త సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్లు చేసే ఆలోచన. అలా బాలీవుడ్ నుంచే తెలుగు తెరకు వచ్చి.. బాలీవుడ్ డ్రీమ్స్ ను వదులుకోలేక నానా ప్రయత్నాలు చేస్తూ వరుసగా ఫెయిల్ అవుతోన్న బ్యూటీ పూజాహెగ్డే. రీసెంట్ గా వచ్చిన కిసీ కీ భాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్ గా మారింది.

అయితే పూజా హెగ్డే రూట్ లోనే రష్మిక మందన్నా కూడా బాలీవుడ్ లో జెండా ఎగురేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టి అతి తక్కువ టైమ్ లోనే అక్కడ షైన్ అయింది. అనూహ్యంగా తనదైన స్టైల్లో పి.ఆర్ చేసుకుని ఏకంగా నేషనల్ క్రష్ అనే ట్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే బయట ఎన్ని చేసినా సినిమాల్లో మేటర్ ఉండాలి కదా..? అందుకే అమ్మడు అమితాబ్ బచ్చన్ తో చేసిన తొలి సినిమా గూడ్ బై పోయింది. తర్వాత చాలా అంచనాలు పెట్టుకున్న మిషన్ మజ్ను కూడా పోయింది. కాకపోతే ఈ మూవీ ఓటిటిలో విడుదలైంది. థియేటర్స్ లో వచ్చి ఉంటే రిజల్ట్ ఏమైనా తేడా ఉండేదేమో అనుకోవడానికి లేదు. ప్లాట్ ఫామ్ ఏదైనా కంటెంట్ మారదు కదా..?


ఇక తర్వాత వరుణ్ ధావన్ తో ఓ సినిమా అనుకున్నారు. కానీ దాని ఊసుఏం లేదు. ప్రస్తుతం హిందీలోనే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్ సరసన యానిమల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు తెలుగులో పుష్ప2తో పాటు నితిన్ సరసన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా, రెయిన్ బో అనే మూవీ చేస్తోంది. అయితే రెండు ఫ్లాపుల తర్వాత బాలీవుడ్ లో ఇక రష్మిక మందన్నా కథ ముగిసినట్టే అనుకున్నారు. బట్ అమ్మడు లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ పట్టేసింది. పైగా ఇదో పీరియడ్ డ్రామా కావడం విశేషం.


మరాఠా రాజ్య స్థాపకుడు మహా యోధుడు అయిన శివాజీ మహారాజ్ కథగా ఈ చిత్రం రాబోతోంది. టైటిల్ ‘ఛావా’. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన కాస్ట్యూమ్ తో పాటు ఇతర అంశాలకు సంబంధించి రష్మిక కోసం ప్రత్యేకంగా ఓ శిక్షణ ఇస్తున్నారట. అటు యానిమల్, ఇటు ఈ పీరియడ్ డ్రామా.. రెండూ విజయాలు సాధిస్తే.. రష్మిక బాలీవుడ్ డ్రీమ్ నిజమైనా కావొచ్చు అంటున్నారు. ఏదేమైనా రష్మిక మందన్నా పీఆర్ టీమ్ గట్టిదే.

, , , , , , , , , , , , , , , , , , , , ,