మే నెలలో వచ్చేస్తోన్న ప్రభాస్ ‘కల్కి‘

‘సలార్’ సెన్సేషనల్ హిట్ తో సూపర్ ఫామ్ లోకి వచ్చేశాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ నుంచి రాబోతున్న క్రేజీ మూవీస్ లో ‘కల్కి 2898 ఎడి’ ఒకటి. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ రేంజులో ఈ సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె వంటి భారీ తారాగణం ఉంది. లేటెస్ట్ గా ‘కల్కి’ మూవీకి సంబంధించిన విడుదల తేదీపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. వైజయంతీ సంస్థకు బాగా కలిసొచ్చిన మే 9న ‘కల్కి’ రిలీజ్ కాబోతుంది.

మే 9.. వైజయంతీ సంస్థకు సెంటిమెంట్ డేట్. గతంలో ఇదే డేట్ కి ఇదే సంస్థ నుంచి వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి‘ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్స్ సాధించాయి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే ‘కల్కి‘ని ఈ ఏడాది మే 9కి తీసుకురాబోతున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.

Related Posts