‘ఆర్.ఆర్.ఆర్‘ స్టార్స్ ఇద్దరితోనూ జాన్వీ అదరహో!

అతిలోకసుందరి శ్రీదేవి దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి చక్రం తిప్పితే.. ఇప్పుడు ఆమె తనయ జాన్వీ కపూర్ ఉత్తరాది నుంచి దక్షిణాది వైపు పయనిస్తుంది. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ఒక సినిమా కాదు ఒకేసారి రెండు బడా మూవీస్ తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్.

యాదృశ్చికంగా ‘ఆర్.ఆర్.ఆర్‘ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ ఇద్దరితోనూ వేరు వేరుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ చిత్రాల్లో గ్లామర్ కి పనిచెప్పిన జాన్వీ.. తెలుగులో చేస్తున్న ఈ రెండు సినిమాల్లోనూ చీరకట్టుతో పదహారణాల తెలుగమ్మాయిగా మురిపించబోతుంది. ఇప్పటికే ‘దేవర‘ ఫస్ట్ పార్ట్ ఫినిషింగ్ స్టేజ్ కు చేరితే.. లేటెస్ట్ గా ఆర్.సి. 16 ప్రారంభోత్సవం జరుపుకుంది

Related Posts