మూడు నెలల గ్యాప్ లోనే ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్’

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమాలు ‘ఇండియన్ 2, గేమ్ ఛేంజర్‘. గతంలో ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో చిత్రాన్ని పట్టాలెక్కించే వాడు శంకర్. కానీ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాలను సైమల్టేనియస్ గా పూర్తిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా కమల్ హాసన్ తో ‘ఇండియన్ 2’ మొదలైంది. కొన్ని అనివార్య కారణాలతో ‘ఇండియన్ 2’ ఆగిపోవడంతో.. మధ్యలో రామ్ చరణ్ తో ‘గేమ్ ఛేంజర్’ని షురూ చేశాడు శంకర్.

ఇప్పుడు ఇంచుమించు రెండు సినిమాలు పూర్తవుతున్నాయి. ఇప్పటికే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ మరికొన్ని రోజుల్లోనే షూటింగ్ మొత్తం పూర్తిచేసుకోబోతుంది. ఈనేపథ్యంలో.. ఈ రెండు సినిమాలను ఈ ఏడాదే.. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే తీసుకొచ్చేందుకు ప్లానింగ్ రెడీ చేస్తున్నాడట శంకర్.

కమల్ హాసన్ మోస్ట్ అవైటింగ్ ‘ఇండియన్ 2’ని మే నెలలో వేసవి కానుకగా విడుదల చేయడానికి కసరత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో ఆంధ్ర, నైజాం ఏరియాలలో సురేష్, ఏషియన్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇక.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అయితే.. ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న పవన్ ఆ సమయానికి ‘ఓజీ’ని కంప్లీట్ చేస్తాడా? లేదా? అనేదే డౌట్. అందుకే.. ఆ డేట్ ను ‘గేమ్ ఛేంజర్‘కి తీసుకోవాలనుకుంటున్నారట.

Related Posts