ఆకట్టుకుంటున్న’కోటబొమ్మాళి పి.ఎస్’ టీజర్

రీమేక్స్ తెరకెక్కించడం అంటే అంత ఆషామాషీ కాదు. ఒరిజినల్ లోని సోల్ ని మాత్రమే తీసుకుని.. మన నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాలి. ఈ విషయంలో ‘కోటబొమ్మాళి పి.ఎస్’ సక్సెస్ అవుతోందనే నమ్మకాన్ని ఈ సినిమా టీజర్ కల్పిస్తుంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించిన ‘నాయాట్టు’ రీమేక్ గా ‘కోటబొమ్మాళి పి.ఎస్’ రూపొందుతోంది. నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులే ఓ కేసులో ఇరుక్కుని ఎలా అవస్థలు పడ్డారనే కాన్సెప్ట్‌ తో ఈ చిత్రం రాబోతుంది. లేటెస్ట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమాలోని ‘లింగి లింగి లింగిడి’ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పడు టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, వరలక్షి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ‘జోహర్, అర్జున ఫాల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించాడు. నవంబర్ 24న ‘కోటబొమ్మాళి పి.ఎస్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts