దసరా సినిమాల రన్ టైమ్స్ ఇవిగో..!

దసరా బరిలో దూకడానికి అన్ని భాషల నుంచి అరడజను సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ సినిమాల విడుదలకు కేవలం వారం రోజుల మాత్రమే ఉండడంతో ఒక్కొక్కటిగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా దసరా బరిలో రాబోతున్న సినిమాల సెన్సార్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయి. ముఖ్యంగా దసరా మూవీస్ రన్ టైమ్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు నుంచి దసరా బరిలో రాబోతున్న మొదటి చిత్రం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి‘. అక్టోబర్ 19న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. అక్టోబర్ 18 నుంచే ఈ సినిమా యు.ఎస్.ఎ. ప్రీమియర్స్ మొదలవుతాయి. 295 లొకేషన్స్ లో 808 షోస్ వేయబోతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్స్ కి మంచి స్పందన వస్తోందట. ఇక.. ‘భగవంత్ కేసరి‘ రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ‘అఖండ, వీరసింహారెడ్డి‘ చిత్రాలతో పోల్చుకుంటే ఈ రన్ టైమ్ కొంచెం తక్కువనే చెప్పాలి.

అక్టోబర్ 19నే తమిళం నుంచి దసరా బరిలో రాబోతున్న చిత్రం ‘లియో‘. దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘మాస్టర్‘ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. లేటెస్ట్ గా ‘లియో‘ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి ‘యు/ఎ‘ సర్టిఫికెట్ జారీచేసింది సెన్సార్ బోర్డ్. ‘లియో‘ రన్ టైమ్ 2 గంటల 44 నిమిషాల ఉంటుందట.

కన్నడ నుంచి అక్టోబర్ 19న వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఘోస్ట్‘. శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 13 నిమిషాల అట.

ఇక.. అక్టోబర్ 20న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అయిన చిత్రం ‘గణపథ్‘. టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రన్ టైమ్ 2 గంటల 10 నిమిషాలు అనే ప్రచారం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో విజువల్ వండర్ లా రాబోతున్న ‘గణపథ్‘ వంటి సినిమాకి ఇది తక్కువ రన్ టైమ్ అని చెప్పాలి.

మరోవైపు.. దసరా బరిలో ఎక్కువ రన్ టైమ్ తో రంగంలోకి దిగుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు‘. మాస్ మహారాజ రవితేజ సినిమాలలోనే ఎక్కువ రన్ టైమ్ తో ‘టైగర్ నాగేశ్వరరావు‘ రాబోతుందట. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 1 నిమిషం ఉండబోతున్నట్టు సెన్సార్ రిపోర్ట్. 1970ల కాలం నాటి పీరియడిక్ డ్రామా కాబట్టి.. ఈ సినిమా ఎక్కువ నిడివితో రాబోతుందట.

Related Posts