‘డంకీ‘ నుంచి డ్రాప్ 3 వచ్చేసింది

తన సినిమాలకు సంబంధించిన ప్రచారం విషయంలో సరికొత్త పదనిసలు పలికిస్తుంటాడు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. లేటెస్ట్ మూవీ ‘డంకీ‘ విషయంలోనూ అదే జరుగుతోంది. ‘డంకీ‘ డ్రాప్స్ పేరుతో ఈ సినిమా ప్రచార చిత్రాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ‘డంకీ‘ డ్రాప్ 1, డ్రాప్ 2 కి మంచి రెస్పాన్స్ రాగా.. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి డ్రాప్ 3 వచ్చేసింది. సోనూ నిగమ్ ఆలపించిన ‘నిక్లే థే కభీ హమ్ ఘర్ సే‘ గీతాన్ని డ్రాప్ 3 గా వదిలారు మేకర్స్. ప్రీతమ్ సంగీతంలో జావేద్ అక్తర్ ఈ పాటను రాశాడు.

ఈ మూవీ నుంచి డ్రాప్ 2 గా రిలీజైన ‘లుట్ పుట్ గయా‘ పాట మెలోడియస్ గా ఆకట్టుకుంటే.. ఇప్పుడు విడుదలైన సాంగ్ ఎమోషనల్ గా అలరిస్తుంది. తమ దేశాన్ని వదిలి చట్ట విరుద్ధంగా వేరే దేశానికి పయనమైన కొందరు మిత్రులు కథగా ‘డంకీ‘ సినిమా రూపొందుతోంది. వారి పయనంలో భాగంగా వచ్చే పాట ఇది. ఈ సినిమాలో షారుక్ కి జోడీగా తాప్సీ నటించింది. బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అపజయమెరుగని రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందిన ‘డంకీ‘ డిసెంబర్ 21న విడుదలవుతోంది.

Related Posts