‘డబుల్ ఇస్మార్ట్’ క్లైమాక్స్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరీ టీం ‘డబుల్ ఇస్మార్ట్’ ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ ని ప్రకటించారు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కి మించిన రీతిలో డబుల్ డోస్ ఎంటర్ టైమ్ ను పంచడమే కాదు.. ఈ సినిమాతో యాక్షన్ లోనూ హై స్టాండార్డ్ అవుట్‌ పుట్ ను అందించబోతున్నాడట పూరి జగన్నాథ్.

‘డబుల్ ఇస్మార్ట్’ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే రూ.7 కోట్లు ఖర్చుపెడుతున్నారట. 12 రోజుల పాటు చిత్రీకరించే ఈ ఎపిసోడ్ ఎంతో హైలైట్ గా ఉండబోతుందని చిత్రబృందం చెబుతోంది. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయబోతున్నారు.

Related Posts