కౌంట్ డౌన్ స్టార్ట్..డబుల్ ఇస్మార్ట్ కి 100 రోజులే

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ మూవీ రిలీజ్ డేట్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మేకర్స్ తాజా పోస్టర్ తో వెల్లడించారు. పూరీ టీం డబుల్ ఇస్మార్ట్ ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ ని ప్రకటించారు. 2024 మార్చ్ 8 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అంటే ఈ సినిమా సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

తాజాగా రిలీజ్ చేసిన ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సౌత్ భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Posts