పాపవి నా పోలికలే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులుకు మూడు రోజుల క్రితం కూతురు జన్మించింది. అపోలో హాస్పిటల్ లో ఉపాసన నార్మల్ డెలివరీ ద్వారా పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఆనందానికి అంతు లేకుండా పోయింది. పాప జన్మించిన దగ్గర నుంచి రామ్ చరణ్ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇవాళ (శుక్రవారం) ఉపాసనను డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు. ఈ సందర్భంగా చరణ్‌ మీడియాతో అపోలో హాస్పిటల్ వద్దే కాసేపు ఇంటరాక్ట్ అయ్యాడు.

చరణ్‌ మాట్లాడుతూ.. ” ఈ రోజు కోసం చాలా రోజులుగా చూశాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది డాక్టర్స్ ఉండటం వల్ల మేం ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. అపోలో స్టాఫ్‌ అందరికీ ధన్యవాదాలు. మా పాపకోసం ప్రార్థనలు చేసిన అభిమానుల నుంచి ఇంతకంటే ఏం కోరుకుంటాను. మీ ప్రార్థనల వల్లే అంతా మంచి జరిగింది. అనేక దేశాల నుంచి కూడా మిత్రులు సందేశాలు పంపించారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు.. ఇంత మంది వచ్చారు. మీ సహకారం మరవలేను. ఇక పాపకి నా పోలికలే వచ్చాయి. తన పేరు గురించి ఉపాసన నేనూ ఒకటి అనుకున్నాం. అది సంప్రదాయం ప్రకారం 12 వ రోజో లేక 13వ రోజో తెలియజేస్తాం.” అన్నారు.


మరి వీరు ఏం పేరు పెడతారో కానీ మెగాస్టార్ మాత్రం ఆల్రెడీ మెగా ప్రిన్సెస్‌ గా నామకరణం చేసుకుని సంబరాల్లో మునిగిపోతున్నాడు.

Related Posts