‘యానిమల్’ కి ‘A’ సర్టిఫికెట్..టోటల్ రన్ టైమ్ ఎంతో తెలుసా..?

హిందీలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “యానిమల్” . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నేషనల్ క్ర్సహ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ మూవీకీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటిక్టే టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో సినీ లవర్ యానిమల్ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘యానిమల్’ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరో రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, రష్మిక మందన్న తెలుగులో బాలయ్య అన్ స్టాపబుల్ షోకి కూడా వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న యానిమల్ సినిమాకి తాజాగా సెన్సార్ పూర్తైంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఇక ఈ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ తో ఉంటుందట. ఇంతకముందు సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ కూడా మూడున్నర గంటల నిడివితో తెరకెక్కించారు. ఆ సినిమాకి కూడా ‘A’ సర్టిఫికెట్ వచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ కి ముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ రిలీజ్ తరవాత ఎంతటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో తెలిసిందే. మరి త్వరలో రిలీజ్ కాబోతున్న ‘యానిమల్’ సినిమా విషయంలో ఎన్ని మేకర్స్ ఎన్ని సమస్యలు ఎదుర్కుంటారో చూడాలి.

Related Posts