అమీర్ ఖాన్ కుమార్తె ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం వచ్చే జనవరిలో జరగబోతుంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అప్పుడే మొదలయ్యాయి.

ఐరా ఖాన్ నిశ్చితార్థం ఆమె ప్రియుడు నుపుర్ శిఖారే తో గతేడాది నవంబర్ లోనే జరిగింది. అమీర్ ఖాన్ కు వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైనర్ గా పనిచేసినప్పుడే అతని కుమార్తె ఐరా తో నుపుర్ కి పరిచయమయ్యింది.

అది కాస్తా ప్రేమగా మారింది. 2024, జనవరి 3న ఐరా – నుపుర్ వివాహం జరగబోతుంది.

తాజాగా ఆమిర్‌ ఖాన్‌ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. వరుడు నుపుర్ మహారాష్ట్రకు సంబంధించినవాడు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం పెళ్లి పనులు కెల్వన్‌ తో మొదలవుతాయి.

ఇందులో భాగంగా కాబోయే వధూవరుల కుటుంబాలు ఒకేచోట కలిసి కెల్వన్‌ కార్యక్రమం నిర్వహించాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ఐరా
ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Related Posts