ఛార్మినార్ వీధుల్లో ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి

ఛార్మినార్ .. హైదరాబాద్ నగర కీర్తి కిరీటంలో కలికితురాయి. మామూలుగా ఎప్పుడూ సందడిగా కనిపిస్తుంటుంది ఛార్మినార్. ఇక రంజాన్ మాసంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు. చుట్టు పక్కల వీధుల్లోని షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈ కాలంలో కేవలం ముస్లీములు మాత్రమే కాక.. అన్ని వర్గాల ప్రజలూ షాపింగ్ చేస్తుంటారు. అయితే ఈ ప్రాంతం మట్టి గాజులకు ప్రత్యేకం అని వేరే చెప్పక్కర్లేదు. అలాగే ఓల్డ్ సిటీలో ఉస్మానియా బిస్కెట్స్, ఇరానీ ఛాయ్ టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇలాంటి చోటికి సెలబ్రిటీస్ వెళ్లడం అంటే ఎంత కష్టం. కానీ ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మీ ప్రణతి వెళ్లింది.

ఛార్మినార్ ప్రాంతంలో తనూ షాపింగ్ చేసింది. చాలా సింపుల్ గా కనిపిస్తూ.. ఆ ప్రాంతంలో తనకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్న తనను చూసిన అక్కడి వారు ఆశ్చర్యపోయారు. అలాగే ఫోటోస్ చూసిన వారు కూడా తన సింపుల్సిటీని చూసి మెచ్చుకుంటున్నారు.మామూలుగా లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాలో పెద్దగా హల్చల్ చేయదు. కానీ ఇలా జనాల మధ్యకు రావడం, అదీ ఛార్మినార్ లాంటి ప్రాంతానికి రావడంతో ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కొన్ని విషయాల్లో కొందరు ఆడవారు ఆడంబరాల కంటే ఆనందాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అనేందుకు ప్రణతిని ఓ ఉదాహరణగా చెప్పొచ్చు.

Related Posts