టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోన్న కొత్త కాంబినేషన్ .?

కొన్ని కాంబినేషన్స్ వినగానే ఆసక్తిని కలిగిస్తాయి. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. చాలా తక్కువ మాత్రమే ప్రశ్నార్థకంగా మారతాయి. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఈ మూడో ఫీలింగ్ ఇచ్చేలా ఓ కొత్త కాంబినేషన్ కనిపిస్తోంది. అది కూడా ఓ బ్లాక్ బస్టర్ మూవీకి రీమేక్ కోసం ఫామ్ అవుతోన్న కలయిక. నిజానికి ఇప్పుడు రీమేక్ లకు దాదాపు కాలం చెల్లింది. అందుకు కారణం ఓటిటిలు. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను ఓటిటిలో ఆయా భాషలవాళ్లు సులువుగా చూసేస్తున్నారు. అలాంటప్పుడు రీమేక్ ల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా వచ్చిన గాడ్ ఫాదర్. మళయాలంలో వచ్చిన లూసీఫర్ కు రీమేక్ ఈ చిత్రం. బట్ లూసీఫర్ ను తెలుగు వాళ్లు ఎప్పుడోచూశారు. అందుకే ఎన్ని మార్పులు చేసినా గాడ్ ఫాదర్ పెద్దగా ఆడలేకపోయింది. ఇప్పుడు అలాంటి మరో సూపర్ హిట్ తమిళ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.


తమిళ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మానాడును తెలుగులో తీస్తున్నారు. అక్కడ శింబు, సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినా ఆ రోల్ లో కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. అయితే ఈ చిత్ర తెలుగు వెర్షన్ ను దర్శకుడు హరీశ్ శంకర్ మార్పులు చేశాడు. అయితే దర్శకత్వం మాత్రం దశరథ్ కు ఇస్తున్నారట. దశరథ్ ఎవరు అని ఈ తరం కుర్రాళ్లు అడిగితే తప్పు లేదు. ఎందుకంటే అతను వినిపించడం కూడా మానేసి చాలా రోజులైంది. అప్పుడెప్పుడో వచ్చిన నాగార్జున గ్రీకువీరుడు తర్వాత దశరథ్ ఆల్మోస్ట్ కనుమరుగయ్యాడు. పోనీ ప్రధాన పాత్రలైనా సరిగా ఉన్నాయా అంటే లేదు.


శింబు పాత్రలో రవితేజట, సూర్య రోల్ కోసం జొన్నలగడ్డ సిద్ధును తీసుకోవాలనుకుంటున్నారట. ఈ ఇద్దరూ రాంగ్ చాయిస్ అని మానాడు చూసిన ఎవరికైనా అర్థం అవుతుంది. మానాడు టైమ్ లూప్ లో వచ్చిన ఓ క్లాసిక్ అని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు రూపొందించిన ఈ చిత్రాన్ని ఇలాంటి కాంబినేషన్ లో మళ్లీ తెలుగులో తీయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనేది కామన్ ఆడియన్స్ ఒపీనియన్. మరి వారి ఒపీనియన్ ను మేకర్స్ సీరియస్ గా తీసుకుని కొత్త ఆలోచన చేస్తారా లేక అదే రూట్ లో వెళతారా అనేది చూడాలి.

Related Posts