షరతులు వర్తిస్తాయి గ్రాండ్ ప్రీరిలీజ్‌ ఈవెంట్.

షరతులు వర్తిస్తాయి. ఈ టైటిల్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుందీ మూవి. చైతన్య రావు, భూమిశెట్టి జంటగా.. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజ‌ల్లు నిర్మించిన ఈ మూవీ కుమారస్వామి (అక్షర) దర్శకత్వం వహించారు. ఈ సినిమా మార్చి 15 న గ్రాండ్ రిలీజ్‌ సందర్భంగా.. ప్రీరిలీజ్‌ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ప్రియదర్శి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
సమాజంలో నీ చుట్టూ తెలివైన వారంటున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్పిన మా నాన్న, ఏ పని చేసినా రీతి రివాజు, వాయి వరసలు ఉండాలని చెప్పిన మా అమ్మ, చిన్నూ నువ్వు సినిమాలు తీస్తే నా ట్యూషన్ కు వచ్చే చిన్న పిల్లలు కూడా చూడాలని చెప్పిన నాకు మరో అమ్మ లాంటి భాగ్యవ్వ , సినిమా అంటే పెద్ద మాధ్యమం, కళాత్మకమైంది, వ్యాపారంతో కూడుకున్నది, బాధ్యతతో చేయాల్సిందని నన్ను నమ్మే ఓ వ్యక్తి ..వీళ్లు నలుగురు చెప్పిన మాటలను పాటిస్తూ షరతులు వర్తిస్తాయి సినిమాను రూపొందించానన్నారు డైరెక్టర్‌ కుమారస్వామి. ఈ సినిమాషూటింగ్ కు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా గుర్తు చేసుకుని ధన్యవాదాలు తెలియజేసారాయన.


చైతన్య నాకు మంచి ఫ్రెండ్. కీడా కోలా లాంటి మూవీస్ చేస్తూ సాటి నటుడిగా ఈర్ష్య పడేలా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ప్రయోగాలన్నీ మధ్య తరగతి వారిపైనే జరుగుతుంటాయని, అయితే మంచి ఫలితాలు కూడా మధ్య తరగతి నుంచే వస్తాయి. దానికి నిదర్శనమే మీరంతా. మనం ఇవాళ తెరపై చాలా సూపర్ హీరోస్ ను చూస్తున్నాం. ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి మంచి కథను రాసిన కుమార స్వామి అన్నకి థ్యాంక్స్ అన్నారు ప్రియదర్శి.
మంచి సినిమా చేశామని మేము చెప్పడం కాదు మీరు ప్రూవ్ చేయాలి. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమాను ఎంకరేజ్ చేయండి. ఇది మా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు చైతన్య రావు.

గుడ్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ మధుర శ్రీధర్ రెడ్డి గారు. వేణు ఊడుగుల అన్న కూడా మాకెంతో సపోర్టివ్ గా ఉంటున్నారు. ఇవాళ మా కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చాడు నా ఫ్రెండ్ ప్రియదర్శి. ఒక మంచి సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ప్రియదర్శికి థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చాం. ఆ క్రమంలో మాకు మామిడి హరికృష్ణ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేసి అండగా నిలబడ్డారన్నారు.
మనల్ని చైనా వాడో, పాకిస్థాన్ వాడో మోసం చేయలేదు. మనం నమ్మిన స్నేహితులే మోసం చేశారని ఓ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఇలా..మన జీవితాల్లో జరిగే ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించాడు. ప్రపంచంలో తెలుగువాళ్లు ఎక్కడ ఉన్నా వారి జీవితంలో జరిగిన సందర్భాలను ఈ కథతో రిలేట్ చేసుకుంటారన్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఈ చిత్ర దర్శకుడు కుమారస్వామి నాకు పదేళ్లుగా తెలుసు స్వచ్చమైన వ్యక్తిత్వం ఉన్నవాడని ప్రశంసించారు.
మిగతా అతిధులు, నటీనటులు, టెక్నిషియన్స్ ఈ చిత్ర విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts