HomeMoviesటాలీవుడ్‘గామి‘పై విష ప్రచారం చేస్తున్న వాళ్లకు విశ్వక్ హెచ్చరిక

‘గామి‘పై విష ప్రచారం చేస్తున్న వాళ్లకు విశ్వక్ హెచ్చరిక

-

మహాశివరాత్రి కానుకగా విడుదలైన ‘గామి‘ చిత్రానికి అంతటా మంచి అప్లాజ్ వస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా.. సరికొత్త కంటెంట్ తో రూపొందిన ఈ మూవీలో అఘోర గా కనిపించిన విశ్వక్ సేన్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. అయితే.. ఎంత పాజిటివిటీ ఉందో.. అంతే స్పీడుగా ఈ సినిమాపై నెగటివిటీ స్ప్రెడ్ అవుతోంది.

‘‘గామి‘ చిత్రంపై బుక్ మై షో వంటి ప్లాట్ ఫామ్స్ లో కావాలనే కొంతమంది నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని.. ఈ చిత్రానికి 1 రేటింగ్ ఇస్తూ మెస్సేజెస్ పెడుతున్నారని..‘ మండిపడ్డాడు విశ్వక్ సేన్. అలాంటి మాలిసియస్ బిహేవియర్ వలన 10కి 9గా ఉన్న తమ రేటింగ్ 1కి పడిపోయే అవకాశాలున్నాయని.. ఈ విషయంపై తాను లీగల్ గా ప్రొసీడ్ అవుతానని ఓ నోట్ విడుదల చేశాడు విశ్వక్ సేన్.

మరోవైపు ‘గామి‘ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అండగా నిలిచిన మీడియా మిత్రులకు, క్రిటిక్స్ కు తన స్పెషల్ నోట్ లో ధన్యవాదాలు తెలిపాడు విశ్వక్ సేన్.

ఇవీ చదవండి

English News