పూరీ జనగణమన పై ఎందుకంత హైప్ ..?

పూరీ జగన్నాథ్.. దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ తర్వాత కొత్త తరంలో దర్శకులు కావాలనుకున్నవారికి ఇన్సిస్పిరేషన్ గా నిలిచిన దర్శకుడు. డాషిండ్ డైరెక్టర్ గా తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. చాలా సినిమాలు విమర్శలకు గురైనా.. ఆడవారిని కించపరిచేలా చిత్రీకరణ ఉంటుందన్న కమెంట్స్ ఉన్నా.. దర్శకుడుగా పూరీ జగన్నాథ్ టేకింగ్ విషయంలో ఎవరూ కాదనలేని ప్రతిభావంతుడు. ఆ కారణంగానే ఎంతోమందికి ఆదర్శం అయ్యాడు. అయితే రొటీన్ సినిమాలే చేస్తూ కొన్నాళ్ల క్రితం ఆల్మోస్ట్ ఫేడవుట్ అయ్యే దశకు వచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈమూవీ తర్వాత అతను జనగణమన అనే సినిమా చేయబోతున్నాడనే వార్త కన్ఫార్మ్ అయింది. అయితే ఈ చిత్రంపై చాలాయేళ్లుగా ఓ హైప్ ఉంది. అందుకు కారణం ఏంటనేది చూస్తే.. ఇదో పొలిటికల్ సెటైరికల్ చిత్రం అని అప్పట్లో చెప్పుకున్నారు. మరి ఆ హైప్ ఇప్పుడూ ఎందుకు ఉందో తెలుసా..?
వరుస హిట్స్ తో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పూరీ జగన్నాథ్ చెప్పిన మాట ఈ ‘జనగణమన’. పైగా ఈ సినిమాను అప్పటికే కాస్త రెబల్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తో చేస్తాడు అనే టాక్ తో మరింత హైప్ వచ్చింది. తర్వాత పోకిరి, బిజినెస్ మేన్ వంటి సినిమాలతో పూరీ, మహేష్ కాంబోకు భారీ క్రేజ్ వచ్చింది. దీంతో మహేష్ తో చేయబోతున్నాడీ సినిమాను అంటూ మరోసారి వార్తలు వచ్చాయి. నిజానికి ఈ కథేంటీ, కంటెంట్ ఎలా ఉంటుందనే విషయంలో ఎవరీకీ క్లారిటీ లేదు. ఉన్నవన్నీ రూమర్లే. అయినా పూరీ జగన్నాథ్ ఉన్న ఫామ్ వల్ల అప్పట్లో ఈ సినిమా గురించి బాగా చెప్పుకున్నారు. ఆ కారణంగానే ఇప్పుడూ ‘కొంతమంది’ఈ చిత్రం విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇప్పటికీ ఈ హైప్ ను కంటిన్యూ చేయడం సాధ్యమా అంటే ఖచ్చితంగా చెప్పలేం.
నిజానికి పూరీ జగన్నాథ్ రైటింగ్ లో తోపు. అందరికీ తెలుసు. కానీ పొలిటికల్ గా ఓ సెటైర్ వేయడం.. ఎవరో ఒక ఇడియట్.. ఏదో ఒక అమ్మాయి ఇంటికి వెళ్లి ఆమెపై కూర్చుని ఆల్మోస్ట్ రేప్ చేసినంత పని చేయడం లాంటివి రాసినంత సులువు కాదు. ఈ విషయం ఆల్రెడీ కెమెరామెన్ గంగతో రాంబాబుతో ప్రూవ్ అయింది. పైగా ఇందులోనూ పవన్ కళ్యాణ్ హీరో. అలాగే అప్పటి రాజకీయ పరిస్థితులపైనే తీశాడు. బట్.. సినిమా ఏ మాత్రం మెప్పించలేదు. ఇటు విజయ్ దేవరకొండ కూడా నోటా అనే పొలిటికల్ మూవీ చేసి భంగపడ్డాడు.
పాడ్ కాస్ట్ చేస్తూ తోచింది మాట్లాడటం వేరు. ఆవేశంగా డైలాగులు చెప్పడం వేరు. ఆలోచనాత్మకంగా ఎవరినీ నొప్పించకుండా.. ఆమోదయోగ్యంగా ఓ మాటను రాయడం వేరు. ఈ విషయంలో పూరీ చాలా తక్కువ సార్లు మాత్రమే మెప్పించాడు. అందుకే జనగణమన ఎలాంటి కథ అయినా పూరీని పూర్తిగా నమ్మడం కష్టమే.
ఒకవేళ లైగర్ సూపర్ హిట్ అయ్యి.. ఈ కాంబోకు క్రేజీ ఫాలోయింగ్ వస్తే.. ఈ మూవీ మరోసారి వార్తల్లో స్ట్రాంగ్ గా ఉంటుంది. లేదంటే.. ఈ హైప్ వార్తలకే పరిమితం అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.

Related Posts