మహేష్, త్రివిక్రమ్ సినిమాలో ఆఫరా.. అయితే ఏంటీ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమాలో ఆఫర్ అంటే చిన్న విషయం కాదు. అది కూడా ఒకటీ రెండు సినిమాలు చేసిన భామలకు. అలాంటిది అయితే నాకేంటీ అనే రేంజ్ డిమాండ్స్ తో షాక్ ఇస్తోందట పెళ్లి సందడి పిల్ల శ్రీలీల. అయితే అమ్మడి నిర్ణయంలో తెలివి ఉంది. యస్.. తను చాలా ఆలోచించే ఈ డైలాగ్ లాంటిది అనేస్తోందట. మరి మహేష్ మూవీ అయినా త్రివిక్రమ్ డైరెక్టర్ అయినా భారీ డిమాండ్స్ పెట్టడం అంటే ఆలోచించాల్సిన అంశమే కదా..? మరి ఆ అంశం ఏమై ఉంటుంది.. అంటే త్రివిక్రమ్ హిస్టరీయే.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో దాదాపు దశాబ్ధం దాటిన తర్వాత సినిమా రాబోతోంది. గతంలో అతడు, ఖలేజా వంటి మూవీస్ తో మిక్స్ డ్ రిజల్ట్ చూసిన ఈ కాంబినేషన్ ఈ సారి ఓ భారీ విజయంపై కన్నేసింది. హారిక హాసిని బ్యానర్ లో రాబోతోన్న ఈ మూవీ రీసెంట్ గా ఓపెనింగ్ జరుపుకుంది కూడా. హీరోయిన్ గా పూజాహెగ్డేనే మళ్లీ రిపీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. పూజ, త్రివిక్రమ్ కాంబోలో ఇది మూడో సినిమా. పూజా హెగ్డే అటు మహేష్ తోనూ మహర్షి మూవీలో రొమాన్స్ చేసి ఉంది. అందుకే ఇది సజావుగా సాగిపోయే సినిమా అవుతుందనుకోవచ్చు. అయితే ఎప్పట్లానే హీరోయిన్ కు చెల్లిగానో, హీరోకు మరో రిలేషన్ లో మరదలిగానో ఇంకో హీరోయిన్ కు ఛాన్స్ ఉందట. ఆ హీరోయిన్ గా ప్రస్తుతం భీమ్లా నాయక్ లో రానా సరసన చేస్తోన్న సంయుక్త మీనన్ ను తీసుకున్నారు అనే వార్తలు వచ్చాయి. సంయుక్త కూడా ముందు ఉత్సాహంగానే ఉంది. కానీ త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్లుగా చేసిన భామల కెరీర్ ను గురించి చాలామంది హెచ్చరించడంతో తను సింపుల్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో ఈ రెండో హీరోయిన్ పాత్ర కోసమే పెళ్లి సందడి బ్యూటీ శ్రీ లీలను సంప్రదించారు.
అయితే ఈ సినిమాలో నటించేందుకు ఏ ఇబ్బందీ లేదనీ.. కాకపోతే కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వాలనే కండీషన్ పెట్టిందట శ్రీ లీల. అంటే సినిమాలో తన పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా.. రెమ్యూనరేషన్ అయినా మిగులుతుంది కదా అనే ముందు తెలివి ఈ భామది. అయితే ఏదో పాతిక, ముఫ్ఫైలో పనైపోతుందని భావించిన మేకర్స్ కు ఇది ఊహించని షాక్ అయింది. శ్రీ లీల ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ కాదు. కానీ తను చాలా ఛలాకీగా నటించిందా సినిమాలో. ఓ రకంగా ఆ మూవీ కమర్షియల్ గా బానే వర్కవుట్ అవడానికి కారణం తన ఛార్మింగ్ పర్ఫార్మెన్సే అనేది నిజం.
మొత్తంగా శ్రీ లీల చెప్పిన రెమ్యూనరేషన్ విన్న మేకర్స్ కొత్త ఆలోచనలో పడ్డారట. తీసుకోవాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు. అంటే కేవలం కోటితోనే పోదు కదా.. ఓ స్టార్ హీరోయిన్ కు ఇచ్చిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి మహేష్ మరదలిగా ఈ పిల్ల ఉంటుందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Related Posts