మొదట విజయ్.. చివర్లో ప్రభాస్

ఈ సమ్మర్ లో సినిమాల పరంగా సరైన ఎంటర్టైన్మెంట్ లేక చాలా ఇబ్బంది పడ్డారు మూవీ లవర్స్.పెద్ద స్టార్లు రాలేదు. చిన్నసార్లు ఆకట్టుకోలేదు. వచ్చిన అవకాశాన్ని వాడుకుని వహ్వా అనిపించిన సినిమా ఒక్కటీ లేదు. దీంతో ఆడియన్స్ మంచి వినోదాన్ని చాలా మిస్ అయిపోయారు.

ఆ లోటును తీర్చేందుకు జూలైలో పవన్ కళ్యాణ్‌ బ్రో ఉన్నా.. నమ్మకం పెద్దగా లేదనేది ఆడియన్స్ ఫీలింగ్. బట్ ఆగస్ట్ మాత్రం అదరగొట్టబోతోందనుకోవచ్చు. ఆగస్ట్ లో మెగాస్టార్ భోళా శంకరుడుగా వస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ జైలర్ గా రాబోతున్నాడు.

ఈ రెండిటి తర్వాత సెప్టెంబర్ మాత్రం అదరగొట్టబోతోంది. నెల మొదటి రోజే విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ వస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. కాంబినేషన్ క్రేజ్ కూడా కలిసొస్తుంది. పైగా ఇది ఇండివిడ్యువల్ గా హిట్ కాంబోలో వస్తోన్న సినిమా కూడా.


సెప్టెంబర్ 7న జవాన్ రాబోతోంది. పఠాన్ వంటి ట్రెమండస్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ చేస్తోన్న సినిమా ఇది. షారుఖ్ మూవీపై మనం అంచనాలు పెట్టుకోవడం ఏంటీ అనుకుంటున్నారేమో.. ఈ మూవీకి దర్శకుడు అట్లీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ. తన సెంటిమెంట్ బ్యూటీ నయనతారను ఈ చిత్రంతో బాలీవుడ్ కూ పరిచయం చేస్తున్నాడు.

విలన్ విజయ్ సేతుపతి, ప్రియమణి ఉంది. యోగిబాబు కూడా ఉన్నాడు. అంటే ఇది సౌత్ ఆడియన్స్ కు కూడా సరైన ఎంటర్టైనర్ అవుతుందని వేరే చెప్పాలా..? పైగా పఠాన్ తర్వాత షారుఖ్ ఈ తరం ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాడు. సో ఈ ప్యాన్ ఇండియన్ మూవీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.
ఆ నెక్ట్స్ వారం మన మాసివ్ కాంబినేషన్ రాబోతోంది.

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబోలో రూపొందుతోన్న చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్టు రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీతో రామ్ కూడా ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. సినిమా కంటెంట్ ఎలా ఉన్నా.. కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలా సెకండ్ వీకెండ్ కూ సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది.


ఇక రామ్- బోయపాటి కంటే ముందే ఇదే డేట్ కువస్తున్నట్టు డిజే టిల్లు స్క్వేర్ టీమ్ ప్రకటించింది. డిజే టిల్లు సెన్సేషనల్ హిట్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రం కూడా ఫస్ట్ పార్ట్ లాగా కిరాక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని నమ్మొచ్చు. ఎందుంటే ఇంకా టీజర్ కూడా రాకుండానే ఈ మూవీ బిజినెస్ అయిపోయింది.


ఇక సెప్టెంబర్ మొదటి రోజు విజయ్ దేవరకొండ, సమంత వినోదం పంచితే.. ఆఖర్లో వస్తున్నాడు ఆలిండియా టాప్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఇండయాస్ బిగ్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న డార్లింగ్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న సలార్ తో సెప్టెంబర్ 28న రాబోతున్నాడు.

ఈ మూవీపై ఎన్ని అంచనాలున్నాయో చెప్పడానికి లెక్కలు కూడా లేవు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తోన్న సినిమా కావడం.. అది ప్రభాస్ హీరో కావడం ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. సో.. సమ్మర్ పోయినా.. సెప్టెంబర్ లో మాత్రం సాలిడ్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అనేలా దసరాకు ముందే దూమ్ దామ్ జరిగేలా ఉంది.

Related Posts