మొదట విజయ్.. చివర్లో ప్రభాస్

ఈ సమ్మర్ లో సినిమాల పరంగా సరైన ఎంటర్టైన్మెంట్ లేక చాలా ఇబ్బంది పడ్డారు మూవీ లవర్స్.పెద్ద స్టార్లు రాలేదు. చిన్నసార్లు ఆకట్టుకోలేదు. వచ్చిన అవకాశాన్ని వాడుకుని వహ్వా అనిపించిన సినిమా ఒక్కటీ లేదు. దీంతో ఆడియన్స్ మంచి వినోదాన్ని చాలా మిస్ అయిపోయారు.

ఆ లోటును తీర్చేందుకు జూలైలో పవన్ కళ్యాణ్‌ బ్రో ఉన్నా.. నమ్మకం పెద్దగా లేదనేది ఆడియన్స్ ఫీలింగ్. బట్ ఆగస్ట్ మాత్రం అదరగొట్టబోతోందనుకోవచ్చు. ఆగస్ట్ లో మెగాస్టార్ భోళా శంకరుడుగా వస్తున్నాడు. అలాగే సూపర్ స్టార్ జైలర్ గా రాబోతున్నాడు.

ఈ రెండిటి తర్వాత సెప్టెంబర్ మాత్రం అదరగొట్టబోతోంది. నెల మొదటి రోజే విజయ్ దేవరకొండ, సమంత ఖుషీ వస్తుంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. కాంబినేషన్ క్రేజ్ కూడా కలిసొస్తుంది. పైగా ఇది ఇండివిడ్యువల్ గా హిట్ కాంబోలో వస్తోన్న సినిమా కూడా.


సెప్టెంబర్ 7న జవాన్ రాబోతోంది. పఠాన్ వంటి ట్రెమండస్ బ్లాక్ బస్టర్ తర్వాత షారుఖ్ చేస్తోన్న సినిమా ఇది. షారుఖ్ మూవీపై మనం అంచనాలు పెట్టుకోవడం ఏంటీ అనుకుంటున్నారేమో.. ఈ మూవీకి దర్శకుడు అట్లీ. బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన అట్లీ. తన సెంటిమెంట్ బ్యూటీ నయనత�