మెగాస్టార్ చిరంజీవి మెగా154 మేకర్స్ దీపావళికి ముందు విడుదల చేసిన మెగా154 గ్లింప్స్ ఒక మెరుపులా వచ్చి దీపావళి బ్లాస్ట్ కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేలా చేసింది. సినిమా టైటిల్ టీజర్‌ ను విడుదల చేయడంతో ఎదురుచూపులకు తెరపడింది.చిరంజీవి హార్డ్ కోర్ ఫ్యాన్ బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. చిరంజీవి సినిమాల నుండి అభిమానులు ఆశించే ఎలిమెంట్స్ తో ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేశారు దర్శకుడు బాబీ.టైటిల్ టీజర్ లో.. భారీ ఓడలో కూర్చున్న విలన్ .. ఏంట్రా ఆడొస్తే పూనకాలు అన్నారు. అడుగేస్తే అరాచకం అన్నారు. ఎడ్రా మీ అన్నయ్యా .. సౌండే లేదు” అన్న వెంటనే ఒక భారీ బ్లాస్టింగ్ సౌండ్ తో మొత్తం దద్దరిల్లిపోతుంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. స్టయిల్ గా కాల్చుతున్న బీడీతో మొత్తం షిఫ్ ని తగలబెట్టడం మెగామాస్ అనిపించింది. చిరంజీవి, బాబీల క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పవర్ బ్లాస్ట్ ఇంట్రోతో అందరి అంచనాలని అందుకుంది. టీజర్ టైటిల్ చూసిన ప్రేక్షకులు ‘వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్’ అని చెబుతున్నారు. మెగాస్టార్ గెటప్, వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ చిరంజీవి గత బ్లాక్ బస్టర్‌ల ఐకానిక్ పాత్రల గుర్తుకు తెస్తుంది. టైటిల్ టీజర్ లో మాస్ మహారాజా రవితేజ కనిపించనప్పటికీ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల తేదీని ప్రకటించారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి విడుదల కానుంది.ఆర్థర్ ఎ విల్సన్ కెమెరా పనితనం అత్యున్నతంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన బ్రిలియంట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో ఆకట్టుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ డిజైన్ చాలా ఉన్నత స్థాయిలో ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత.నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.

Read More

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా డిసెంబర్‌లో విడుదల కానుంది. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ

Read More

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ల క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి సంబధించిన

Read More

హిట్ ఉంటేనే పట్టించుకునే పరిశ్రమ సినిమా పరిశ్రమ. ఒకప్పుడు ఎంత పెద్దవాళ్లై.. ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా.. ఇప్పుడేంటీ అనేది చూస్తారు తప్ప నిన్న ఎప్పుడూ మేటరే కాదు. అలా మేటర్ లో లేకుండా

Read More

ఒక సినిమా మేకింగ్ లో ఉన్నప్పుడే ఆ దర్శకుడి కెపాసిటీ ఏంటో సీనియర్ హీరోలకు తెలిసిపోతుంది. దీంతో తాము మేకింగ్ లో ఇన్వాల్వ్ కావాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటారు. ఆ డెసిషన్ ను

Read More

రవితేజ కెరీర్‌లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ వేరు. ఇప్పుడు చేస్తున్న టైగర్‌ నాగేశ్వరరావు వేరు. ఆయన కెరీర్‌ మొత్తం మీద ఏ సినిమాకూ ఖర్చుపెట్టనంతగా ఈ సినిమాకు ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఒన్లీ సెట్స్

Read More

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన క్రేజీ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్ లిమిటెడ్ ఎంటర్‌టైనర్ “ధమాకా”. ఎనర్జీకి మారుపేరైన రవితేజ, కమర్షియల్ సబ్జెక్ట్‌లను డీల్ చేయడంలో స్పెషలిస్ట్ అనిపించుకున్న త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తోన్న ఈ చిత్రం నుండి ఇటీవల విడుదలైన మొదటి పాట ‘జింతాక్’కు అద్భుతమైన స్పందన వచ్చింది.తాజాగా ధమాకా చిత్ర యూనిట్ అదిరిపోయే కొత్త అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రం గ్లింప్స్ ఆగస్ట్ 31న విడుదల వినాయక చవితి సందర్భంగా సాయంత్రం 5:01 గంటలకు విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్ కలర్‌ ఫుల్‌ గా, రొమాంటిక్‌ గా కనిపిస్తోంది. రవితేజ శ్రీలీలని తన దగ్గరికి తీసుకొని, ఆమె కళ్ళలోకి ప్రేమగా చూస్తుండగా శ్రీలీల కాస్త టెన్షన్ పడుతూ అయోమయంగా చూడటం ఆకట్టుకుంది, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత‘డబుల్ ఇంపాక్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తారాగణం: రవితేజ, శ్రీలీల సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్ బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని ఫైట్స్: రామ్-లక్ష్మణ్ ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల పీఆర్వో: వంశీ శేఖర్

Read More

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి

Read More