‘ఆహా’లోనూ రీ-రిలీజుల సంప్రదాయం

ప్రస్తుతం థియేటర్లలో రీ-రిలీజుల సంప్రదాయం జోరుగా సాగుతోంది. గతంలో సూపర్ హిట్టైన సినిమాలను మళ్లీ కొత్త ఫార్మాట్స్ లో రీ-రిలీజ్ చేయడం.. ఆ సినిమాలకోసం ఫ్యాన్స్ ఎగబడడం చూస్తూనే ఉన్నాము. అయితే రీ-రిలీజ్ లను థియేటర్ లకు మాత్రమే పరిమితం చేయడం ఎందుకు? మేము కూడా మీకోసం కొన్ని సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్నాము అంటూ ‘ఆహా’ ఓటీటీ కొన్ని క్రేజీ మూవీస్ ను వరుసగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంది.

నవంబర్‌ లో ఆహా ఓటీటీ ప్రీమియం క్వాలిటీతో డిజిటల్‌ గా మూడు క్రేజీ మూవీస్ ను రీ-రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆ చిత్రాలే ‘మగధీర, అతడు, ఘరానామొగుడు’. నవంబర్ 3న రాజమౌళి-రామ్ చరణ్ ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంటే.. నవంబర్ 10న మహేష్ బాబు ‘అతడు’, నవంబర్ 17న చిరంజీవి ‘ఘరానామొగుడు’ సినిమాలు ఆహాలో ప్రీమియర్ గా ప్రీమియమ్ క్వాలిటీలో అలరించడానికి రెడీ అవుతున్నాయి.

Related Posts