మే 17న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘

ఇటీవల ‘గామి‘తో డీసెంట్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు తన తర్వాతి చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ని విడుదలకు ముస్తాబు చేస్తున్నాడు. విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అసలు ఈపాటికే విడుదలవ్వాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవ్వడంతో వాయిదా పడుతూ వచ్చింది.

లేటెస్ట్ గా ఈ మూవీని సమ్మర్ స్పెషల్ గా దింపుతున్నారు. మే 17న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, సుట్టంలా అంటూ సాగే గీతాలకు మంచి పేరొచ్చింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ రాబోతుంది.

Related Posts