‘ఫ్యామిలీ స్టార్‘కి గుమ్మడికాయ కొట్టేశారు!

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‘ తాజాగా షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా లేటెస్ట్ గా షూటింగ్ ఫినిష్ చేసుకున్నట్టు ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తూ ప్రకటించింది టీమ్. ఈ గ్లింప్స్ లో హీరోహీరోయిన్లు విజయ్, మృణాల్ తో పాటు డైరెక్టర్ పరశురామ్.. ‘ఫ్యామిలీ స్టార్‘ పూర్తయినట్టు విభిన్నంగా తెలిపారు.

‘గీత గోవిందం‘ వంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తోన్న ‘ఫ్యామిలీ స్టార్‘పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts