ఈ నెలలోనే విశాల్ మాస్ జాతర ‘రత్నం’

యాక్షన్ స్టార్ విశాల్ నటిస్తున్న ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రత్నం’. గతంలో విశాల్ తో ‘తామరభరణి, పూజై’ వంటి సినిమాలను తెరకెక్కించిన హరి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. విశాల్ కి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. కీలక పాత్రల్లో సముద్రఖని, మురళీ శర్మ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగిబాబు వంటి వారు నటించారు. లేటెస్ట్ గా ‘రత్నం’ మూవీ ట్రైలర్ రిలీజయ్యింది.

హరి మార్క్ టేకింగ్ తో విశాల్ పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ట్రైలర్ ఆద్యంతం రేసీగా ఉంది. గతంలో హరి నుంచి వచ్చిన ‘యముడు, సింగం’ సినిమాల తరహాలోనే ఈ చిత్రం కూడా ఫుల్ లెన్త్ యాక్షన్ ట్రీట్ అందించబోతున్నట్టు అర్థమవుతోంది. అలాగే.. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే విశాల్ ‘పందెంకోడి’ పవర్ కనిపిస్తుంది. హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే రత్నం అనే పాత్రలో విశాల్ కనిపించబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ‘రత్నం’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 26న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Related Posts