మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్‘ కొత్త విడుదల తేదీ ఖరారు చేసుకుంది. మార్చి 1న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. అసలు ఈనెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతోనే వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి.
‘ఎఫ్ 3’ తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన ‘గాండీవధారి అర్జున’ ఏమాత్రం అలరించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు వరుణ్ తన ఆశలన్నీ ‘ఆపరేషన్ వాలెంటైన్’పైనే పెట్టుకున్నాడు. ఏరియల్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి పేరొచ్చింది. మిక్కీ జె మేయర్ స్వరకల్పనలో
ఇటీవల విడుదలైన ‘వందేమాతరం’ పాట ఆకట్టుకుంది.